Share News

ఇంట్లో ఉక్కబోతా..?

ABN , Publish Date - Aug 06 , 2026 | 03:14 AM

వర్షం పడగానే వాతావరణంలో వేడి తగ్గినప్పటికీ గాల్లో తేమ పెరిగి ఉక్కబోతగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఇంట్లో తేమను తగ్గించి గది ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించాలో...

ఇంట్లో ఉక్కబోతా..?

వర్షం పడగానే వాతావరణంలో వేడి తగ్గినప్పటికీ గాల్లో తేమ పెరిగి ఉక్కబోతగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఇంట్లో తేమను తగ్గించి గది ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించాలో చూద్దాం...

  • వర్షం ఆగిన వెంటనే కిటికీలు, తలుపులు తెరవాలి. ఇంట్లో ఫ్యాన్‌ లేదా ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ వేస్తే తేమతో నిండిన గాలి బయటికి వెళుతుంది. తాజా గాలి లోనికి ప్రసరించడంతో గదులన్నీ చల్లగా మారతాయి. వర్షం పడిన తరువాత కూడా బయటి గాలిలో తేమ ఎక్కువగా ఉందనిపిస్తే మాత్రం తలుపులు తీయకపోవడమే మంచిది.

  • వెడల్పాటి గిన్నె నిండా ఐస్‌ క్యూబ్స్‌ నింపి ఫ్యాన్‌ కింద టేబుల్‌పై ఉంచాలి. ఫ్యాన్‌ గాలి మంచు ముక్కలను తాకి ఇల్లంతా ప్రసరిస్తూ తేమను పీల్చుకుంటుంది. దీంతో ఇంట్లో ఏసీ వేసుకున్న అనుభూతి కలుగుతుంది.

  • సాధారణంగా కూలర్‌తోపాటు వాటర్‌ పంప్‌ను కూడా ఆన్‌ చేస్తుంటాం. దీనివల్ల గదిలో తేమ శాతం పెరిగి ఉక్కబోతగా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు వాటర్‌పం్‌పను ఆపేసి కూలర్‌ను ప్యాన్‌ మోడ్‌లో ఉంచితే నిమిషాల్లో గది చల్లబడుతుంది. అలాగే కూలర్‌ను ఆన్‌ చేసేముందు కిటికీలు, తలుపులు తెరచి ఉంచాలి.

  • మట్టి కుండల్లో కలబంద, స్నేక్‌ప్లాంట్‌, మనీ ప్లాంట్‌ లాంటి మొక్కలను నాటి గదుల్లో ఉంచితే క్రమంగా గాలి నాణ్యత మెరుగుపడుతుంది. ఇల్లంతా తాజాదనం నిండుతుంది.

  • మధ్యాహ్న సమయంలో ఎండ లోపలికి ప్రసరించకుండా కిటికీలకు కర్టెన్లు వేయాలి. దీనివల్ల ఇంట్లో వేడి, తేమ పెరగవు. సాయంత్రం కాగానే కర్టెన్లు పక్కకు జరిపేస్తే సరిపోతుంది.

  • ఇంట్లో అవసరం లేని వస్తువులను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి. ఫర్నిచర్‌ను పొందికగా సర్దాలి. అప్పుడే గాలి ఇల్లంతా స్వేచ్ఛగా ప్రసరిస్తూ తాజాదనాన్ని నిలుపుతుంది.

ఇవీ చదవండి:

'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్‌ జీకి రూ.2 వేల కోట్లు

Updated Date - Aug 06 , 2026 | 03:14 AM