Share News

మెదడు చురుకుగా ఇలా..

ABN , Publish Date - Apr 02 , 2026 | 05:38 AM

మానసిక, శారీరక ఆరోగ్యం బాగుండాలంటే మెదడు పనితీరు సక్రమంగా ఉండాలి. ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచుతూ మెదడు చురుకుగా పనిచేయాలంటే...

మెదడు చురుకుగా ఇలా..

మానసిక, శారీరక ఆరోగ్యం బాగుండాలంటే మెదడు పనితీరు సక్రమంగా ఉండాలి. ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచుతూ మెదడు చురుకుగా పనిచేయాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

  • రోజూ కనీసం పావుగంటసేపు ధ్యానం చేయడం మంచిది. దీనివల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఏకాగ్రత రెట్టింపవుతుంది. ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

  • రోజూ కొద్దిసేపు క్రాస్‌వర్డ్స్‌, సుడోకు, పజిల్స్‌ పూర్తిచేయడం, చెస్‌ ఆడడం లాంటివి ప్రయత్నించాలి. వీటివల్ల మెదడుకు ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది. వేగంగా స్పందించడం అలవడుతుంది.

  • రోజూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి. మంచి పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

  • చిన్న చిన్న విషయాలను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఫోన్‌ నెంబర్లు, పాస్‌వర్డ్‌లు, ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనలు, ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకుంటూ మెమరీ ట్రైనింగ్‌ సాధన చేయాలి.

  • రోజూ వ్యాయామం చేయాలి. డీప్‌ బ్రీతింగ్‌ టెక్నిక్స్‌ అనుసరించడం వల్ల మెదడుకు అవసరమైన ఆక్సిజన్‌ అందుతుంది. వాకింగ్‌ లాంటివి శరీరంలో రక్తప్రసరణ మెరుగుపరిచి మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి.

  • గంటల తరబడి విరామం లేకుండా పనిచేయడం లేదా చదవడం వల్ల మెదడు అలసిపోతుంది. అలాకాకుండా మధ్యమధ్యలో చిన్న బ్రేక్‌ తీసుకుంటే మెదడు శక్తిని పుంజుకుంటుంది.

  • రోజూ కనీసం ఎనిమిది గంటలపాటు హాయిగా నిద్రించాలి. అప్పుడే మెదడు, మనసు, శరీరం శక్తిని పుంజుకుని చురుకుగా పనిచేస్తాయి.

ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 05:38 AM