ఇలా చదివించాలి...
ABN , Publish Date - Jul 20 , 2026 | 04:32 AM
పిల్లలు శ్రద్ధగా చదువుకోవాలంటే తల్లిదండ్రులు ఏ జాగ్రత్తలు పాటించాలో చూద్దాం...
పిల్లలు శ్రద్ధగా చదువుకోవాలంటే తల్లిదండ్రులు ఏ జాగ్రత్తలు పాటించాలో చూద్దాం...
పిల్లలు రోజూ కొంత సమయాన్ని చదువుకు కేటాయించేలా చూడాలి. దీన్ని అలవాటుగా మార్చే ప్రయత్నం చేయాలి.
పిల్లల చదువుకు సంబంధించి చిన్న ప్రణాళికను సిద్ధం చేసి దాని ప్రకారమే చదివేలా వారిని ప్రోత్సహించాలి.
ఇంట్లో పిల్లలు చదువుకునేటప్పుడు టీవీ పెట్టకూడదు. మొబైల్స్‌ను సాధ్యమైనంత దూరంలో ఉంచాలి.
పిల్లలు బట్టీ ధోరణిలో కాకుండా ప్రతి అంశాన్ని అర్ధం చేసుకుంటూ చదివేలా చూడాలి.
అదేపనిగా కూర్చుని చదివితే పిల్లల మెదడు అలసిపోతుంది. దీంతో చదివిన అంశాలు గుర్తుండవు. కాబట్టి అరగంటకోసారి కనీసం అయిదు నిమిషాల బ్రేక్ తీసుకోవాలని చెప్పాలి.
బడిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు చదువుకుంటూ హోం వర్క్ పూర్తిచేసేలా చూడాలి.
రోజూ కనీసం ఎనిమిది గంటలు నిద్రించడం, పోషకాహారాన్ని తీసుకోవడం, తగినంత నీరు తాగడాన్ని అలవాటు చేస్తే పిల్లలు ఉత్సాహంగా చదువుపై ఆసక్తి పెంచుకుంటారు. మెదడు చురుకుదనం కూడా పెరుగుతుంది.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!