కనుబొమ్మలు ఒత్తుగా ఇలా...
ABN , Publish Date - Mar 30 , 2026 | 03:16 AM
కొంతమందికి కనుబొమ్మలు పలుచబడుతుంటాయి. దీనివల్ల ముఖ సౌందర్యం తగ్గుతుంటుంది. అలాకాకుండా చిన్న చిట్కాలతో కనుబొమ్మలు నల్లగా ఒత్తుగా...
కొంతమందికి కనుబొమ్మలు పలుచబడుతుంటాయి. దీనివల్ల ముఖ సౌందర్యం తగ్గుతుంటుంది. అలాకాకుండా చిన్న చిట్కాలతో కనుబొమ్మలు నల్లగా ఒత్తుగా పెరిగేలా చేయవచ్చు. ఆ వివరాలు...
ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది వెంట్రుకల పెరుగుదలకు దోహదం చేస్తుంది. రోజూ రాత్రి పడుకునేముందు కనుబొమ్మలకు కొద్దిగా ఉల్లిపాయ రసం రాస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
రోజూ స్నానానికి వెళ్లే ముందు కనుబొమ్మలకు కోడిగుడ్డు తెల్లసొనను పట్టించాలి. దీనిలోని ప్రొటీన్ కనుబొమ్మలు దట్టంగా పెరిగేందుకు తోడ్పడుతుంది.
రాత్రి పడుకునేముందు చిన్న గిన్నెలో కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఆముదాన్ని తీసుకుని గోరువెచ్చగా వేడిచేయాలి. తరువాత చూపుడువేలితో కొద్దికొద్దిగా తీసుకుంటూ కనుబొమ్మల మీద సున్నితంగా మర్దన చేయాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.
ఉదయాన్నే నీళ్లలో మెంతులు వేసి నానబెట్టాలి. రాత్రి పడుకునేముందు వీటిని మెత్తగా నూరి కనుబొమ్మలకు పట్టించాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఇ విటమిన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ లేదా కలబంద గుజ్జు రాసినా కూడా కనుబొమ్మలు బాగా పెరుగుతాయి.
తరచూ త్రెడ్డింగ్ చేయించుకోవడం వల్ల కనుబొమ్మలు పలుచబడవచ్చు. అలాకాకుండా కనుబొమ్మలు బాగా పెరిగినప్పుడు మాత్రమే త్రెడ్డింగ్ చేయించుకోవడం మంచిది.
ఇవీ చదవండి:
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు