కుండీలో గోరింటాకు...
ABN , Publish Date - Jul 20 , 2026 | 04:30 AM
అందంతోపాటు ఆరోగ్యానికీ పలు విధాలుగా తోడ్పడే గోరింటాకు మొక్కని కుండీలో ఎలా పెంచుకోవచ్చో చూద్దాం...
అందంతోపాటు ఆరోగ్యానికీ పలు విధాలుగా తోడ్పడే గోరింటాకు మొక్కని కుండీలో ఎలా పెంచుకోవచ్చో చూద్దాం...
ముదురు ఆకుపచ్చ రంగులో దళసరిగా చిన్న సైజు ఆకులతో ఉన్న గోరింటాకు మొక్కను నర్సరీ నుంచి తెచ్చుకోవాలి. దీన్ని కలబంద గుజ్జులో ముంచి నాటితే చక్కగా ఎదుగుతుంది. విత్తనాలను తెచ్చి వాటిని రెండు రోజులు నీటిలో నానబెట్టి ఆపైన తడి మట్టిలో నాటి కూడా మొక్కలు పెంచవచ్చు.
ఈ మొక్క ఇసుకతో కూడిన ఎర్ర మట్టి నేలల్లో బాగా పెరుగుతుంది.
ఈ మొక్కకు రోజూ నీరు పోయనక్కర్లేదు. మట్టి తడారినప్పుడు మాత్రమే కొద్దిగా నీటిని చిలకరిస్తే సరిపోతుంది.
15 రోజులకోసారి మట్టిలో వర్మీ కంపోస్టు లేదా సేంద్రియ ఎరువులు కలుపుతుండాలి.
మూడు నెలలకోసారి అదనపు కొమ్మలను కత్తిరిస్తుంటే కొత్త చిగుళ్లు వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది.
కాండం లేదా ఆకులపై తెగుళ్లు, ఏవైనా క్రిమి కీటకాలు కనిపిస్తే లీటరు నీటిలో రెండు చెంచాల వేప నూనె కలిపి పిచికారీ చేయాలి. అర కప్పు పుల్లటి మజ్జిగలో అరకప్పు నీటిని కలిపి స్ర్పే చేసినా కూడా ప్రయోజనం ఉంటుంది.
మొక్క నుంచి 30 శాతానికి మించి ఆకులను కోయకూడదు. తరచూ ఆకులను కోస్తుంటే కొత్తవి వస్తుంటాయి.
మొక్క బాగా పెరిగినట్లయితే అవసరం మేరకు మరింత పెద్ద కుండీలోకి మార్చడం మంచిది.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!