Share News

వీటితో బొద్దింకలకు చెక్‌...

ABN , Publish Date - May 20 , 2026 | 05:13 AM

ఇంట్లో తిరిగే బొద్దింకల వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ బొద్దింకలను సులువుగా వదిలించుకునే చిట్కాలివే...

వీటితో బొద్దింకలకు చెక్‌...

ఇంట్లో తిరిగే బొద్దింకల వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ బొద్దింకలను సులువుగా వదిలించుకునే చిట్కాలివే...

  • పండిన టమాటాను తీసుకుని చిన్న ముక్కలుగా కోయాలి. వీటిపై కొద్దిగా బేకింగ్‌ సోడాను చల్లి బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఉంచాలి. వీటిని తిని ఇంట్లో ఉన్న బొద్దింకలన్నీ చనిపోతాయి. రెండు రోజుల్లో సమస్య తీరుతుంది.

  • చిన్న గిన్నెలో రెండు చెంచాల బోరిక్‌ యాసిడ్‌, చెంచా పంచదార పొడి వేసి కొన్ని నీళ్లు చిలకరించి బాగా కలపాలి. ఆపైన చిన్న ఉండలుగా చేసి బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో ఉంచాలి. ఒక్క పూటలో మంచి ఫలితం కనిపిస్తుంది.

  • బిర్యానీ ఆకులను చిన్న ముక్కలుగా చేసి వంటింటి సింక్‌, అరల మూలలు, గ్యాస్‌ స్టవ్‌ వెనక భాగాల్లో ఉంచితే ప్రయోజనం ఉంటుంది.

  • స్టవ్‌ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్లు పోసి అందులో రెండు వెల్లుల్లి రెబ్బలు, మూడు ఉల్లిపాయ ముక్కలు, చెంచా మిరియాల పొడి వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడబోసి స్ర్పే బాటిల్‌లో పోసి బొద్దింకలు తిరిగే చోట స్ర్పే చేస్తే చాలు సమస్య తీరుతుంది.

ఇవి కూడా చదవండి..

ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. రాజీవ్ గాంధీ హత్యను గుర్తుచేసిన బీజేపీ..

బీజేపీ బెదిరింపులతోనే పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్.. టీఎంసీ ఫైర్

Updated Date - May 20 , 2026 | 05:13 AM