Share News

వాటర్‌ బాటిల్స్‌ తాజాగా..

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:09 AM

ఒక్కోసారి వాటర్‌ బాటిల్స్‌ నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. మూతల చుట్టూ జిడ్డు పేరుకుంటుంది కూడా. అలాంటప్పుడు వాటిని సులువుగా శుభ్రం చేసే చిట్కాలివే...

వాటర్‌ బాటిల్స్‌ తాజాగా..

ఒక్కోసారి వాటర్‌ బాటిల్స్‌ నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. మూతల చుట్టూ జిడ్డు పేరుకుంటుంది కూడా. అలాంటప్పుడు వాటిని సులువుగా శుభ్రం చేసే చిట్కాలివే...

  • ఒక గిన్నెలో నాలుగు గ్లాసుల గోరువెచ్చటి నీటిని తీసుకుని అందులో రెండు చెంచాల వెనిగర్‌ వేసి బాగా కలపాలి. ఈ నీటిని వాటర్‌బాటిల్స్‌లో నింపి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే నీటిని వంపేసి పొడవాటి బ్రష్‌తో రుద్దుతూ శుభ్రం చేస్తే వాటర్‌ బాటిల్స్‌ తాజాగా మారతాయి.

  • వాటర్‌ బాటిల్స్‌లో వాడేసిన నిమ్మ తొక్కలు వేసి సగానికి పైగా గోరువెచ్చటి నీటిని నింపి మూతలు బిగించి వేగంగా ఊపాలి. ఆపైన వాటిని మంచి నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది.

  • చిన్న గిన్నెలో చెంచా బేకింగ్‌ సోడా వేసి కొన్ని నీళ్లు చిలకరించి పేస్టులా చేయాలి. దీన్ని కొద్ది కొద్దిగా వాటర్‌ బాటిల్స్‌లో వేసి పాత టూత్‌బ్ర్‌షతో రుద్ది కడిగితే ప్రయోజనం ఉంటుంది. ఇలాగే మూతలు కూడా శుభ్రం చేయాలి.

  • వాటర్‌ బాటిల్స్‌లో కొద్దిగా రాళ్ల ఉప్పు, రెండు ఐస్‌ క్యూబ్స్‌ వేసి కొన్ని నీళ్లు పోసి మూతలు బిగించి వేగంగా పైకి కిందికి ఊపాలి. పది నిమిషాల తరువాత మంచినీటితో శుభ్రం చేస్తే దుర్వాసన తొలగి బాటిల్స్‌ తాజాగా ఉంటాయి.

  • వాడేసిన కాఫీ లేదా టీ పొడితో వాటర్‌ బాటిల్స్‌ను రుద్ది శుభ్రం చేసినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

  • వాటర్‌ బాటిల్స్‌కు మూతలు తీసి కొద్దిసేపు ఎండలో ఉంచితే వాటిలోని దుర్వాసనలు మాయమవుతాయి.

  • చిన్న గిన్నెలో కొద్దిగా బియ్యపిండి, కొద్దిగా డిష్‌ వాషింగ్‌ లిక్విడ్‌ వేసి కలిపి పేస్టులా చేయాలి. దీన్ని పాత టూత్‌బ్ర్‌షతో తీసుకుంటూ వాటర్‌ బాటిల్స్‌ బయట, లోపల రుద్ది కడిగితే జిడ్డు, దుర్వాసనలు తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి..

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం

కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే

Updated Date - Jun 04 , 2026 | 12:09 AM