Share News

స్నీకర్స్‌ శుభ్రం ఇలా...

ABN , Publish Date - Jun 24 , 2026 | 06:11 AM

బురద, మురికి అంటిన స్నీకర్స్‌ను సులువుగా శుభ్రం చేసే చిట్కాలివే...

స్నీకర్స్‌ శుభ్రం ఇలా...

బురద, మురికి అంటిన స్నీకర్స్‌ను సులువుగా శుభ్రం చేసే చిట్కాలివే...

  • గిన్నెలో చెంచా బేకింగ్‌ సోడా, అర చెంచా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వేసి కొన్ని నీళ్లు చిలకరించి పేస్టులా చేయాలి. దీన్ని పాత టూత్‌బ్ర్‌షతో తీసుకుని స్నీకర్స్‌ పై రాసి ఎండలో ఉంచాలి. రంగు రంగుల స్నీకర్స్‌ను నీడలోనే ఆరనివ్వాలి. తరువాత పాత రుమాలుతో తుడిచేస్తే మరకలన్నీ తొలగి స్నీకర్స్‌ కొత్తవాటిలా మెరుస్తాయి.

  • స్నీకర్స్‌ అడుగు భాగంలో ఉండే రబ్బర్‌ రిమ్స్‌పై ఎక్కువగా మరకలు పడుతుంటాయి. వీటిపై టూత్‌పేస్టు రాసి కొద్దిగా నీటిని చిలకరించి టూత్‌బ్ర్‌షతో రుద్దాలి. పది నిమిషాల తరువాత పొడిగుడ్డతో తుడిస్తే సరిపోతుంది.

  • ఒక బకెట్‌ నీటిలో అర కప్పు వెనిగర్‌ వేసి బాగా కలపాలి. అందులో మరకలతో నిండిన స్నీకర్స్‌ వేసి అరగంటసేపు నానబెట్టాలి. తరువాత మంచినీటితో కడిగి గాలికి ఆరబెడితే ప్రయోజనం ఉంటుంది.

  • అర బకెట్‌ నీటిలో రెండు చెంచాల బ్లీచింగ్‌ పౌడర్‌ వేసి బాగా కలపాలి. అందులో స్నీకర్స్‌ సోల్స్‌ వేసి గంటసేపు నానబెట్టాలి. తరువాత వాటిని మంచినీటిలో ముంచి తీసి ఆరబెట్టాలి. ఎప్పటికప్పుడు ఇలా చేస్తుంటే దుర్వాసన తొలగి సోల్స్‌ శుభ్రంగా ఉంటాయి.

  • చిన్న గిన్నెలో చెంచా బేకింగ్‌ సోడా, రెండు చెంచాల వెనిగర్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్నీకర్స్‌ లేసులకు పట్టించి గంట తరువాత నీళ్లలో ముంచి తీసి ఆరబెడితే అవి పూర్తిగా శుభ్రపడతాయి.

  • మేక్‌పను తొలగించేందుకు ఉపయోగించే మైసెల్లార్‌ వాటర్‌ను పలుచని రుమాలుమీద వేసి మరకలున్న చోట రుద్దాలి. ఆపైన పొడిగుడ్డతో తుడిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి

Updated Date - Jun 24 , 2026 | 06:11 AM