Share News

కిచెన్‌ టవల్స్‌ జిడ్డు వదిలేదెలా..?

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:05 AM

మనం వంటగదిలో చిన్న చిన్న టవల్స్‌ వాడుతూ ఉంటాం. వీటికి తరచూ జిడ్డు పడుతూ ఉంటుంది. వీటిపై రకరకాల మరకలు కూడా...

కిచెన్‌ టవల్స్‌ జిడ్డు వదిలేదెలా..?

మనం వంటగదిలో చిన్న చిన్న టవల్స్‌ వాడుతూ ఉంటాం. వీటికి తరచూ జిడ్డు పడుతూ ఉంటుంది. వీటిపై రకరకాల మరకలు కూడా ఏర్పడుతుంటాయి. ఈ టవల్స్‌ను సులువుగా శుభ్రం చేసే చిట్కాలివే...

  • ఒక బకెట్లో సగం వరకు వేడి నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా డిష్‌ వాష్‌ లిక్విడ్‌ వేసి బాగా కలపాలి. ఈ నీళ్లలో కిచెన్‌ టవల్స్‌ వేసి కనీసం రెండు గంటలపాటు నానబెట్టాలి. తరువాత బ్రష్‌తో రుద్ది మంచినీటితో ఉతికితే కిచెన్‌ టవల్స్‌ తేలికగా శుభ్రపడతాయి.

  • అర బకెట్‌ నీళ్లలో పావు కప్పు వెనిగర్‌ వేసి బాగా కలపాలి. అందులో కిచెన్‌ టవల్స్‌ వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం సబ్బురాసి ఉతికితే సరిపోతుంది.

  • వెడల్పాటి గిన్నెలో సగానికిపైగా వేడినీళ్లు తీసుకుని అందులో రెండు చెంచాల బేకింగ్‌ సోడా వేసి బాగా కలపాలి. తరువాత అందులో కిచెన్‌ టవల్స్‌ ఉంచి పది నిమిషాల తరువాత చేత్తో రుద్దుతూ మంచినీటితో ఉతికితే జిడ్డు, దుర్వాసన వదిలి టవల్స్‌ కొత్తవాటిలా తయారవుతాయి.

  • కిచెన్‌ టవల్స్‌ మరీ మురికిగా అయ్యేంత వరకూ వాడకుండా ఎప్పటికప్పుడు వాటిని సబ్బునీళ్లలో నానబెట్టి వేడినీటితో ఉతికితే సరిపోతుంది. వంటగదిలో ఒకటి లేదా రెండు కాకుండా నాలుగైదు టవల్స్‌ను పెట్టుకొని వాడడం వల్ల వాటిని శుభ్రం చేయడం తేలికగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్

Updated Date - Apr 08 , 2026 | 05:05 AM