కొబ్బరి బొండం కొనేముందు
ABN , Publish Date - Oct 29 , 2026 | 04:25 AM
మార్కెట్లో కొబ్బరి బొండాన్ని కొనేటప్పుడు తాజాగా ఎక్కువ నీళ్లతో ఉన్నదాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం...
మార్కెట్లో కొబ్బరి బొండాన్ని కొనేటప్పుడు తాజాగా ఎక్కువ నీళ్లతో ఉన్నదాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం...
కొబ్బరి బొండం.. సహజసిద్ధమైన ఆకుపచ్చని రంగుతో అక్కడక్కడా లేత పసుపు లేదా గోధుమ రంగు మచ్చలతో ఉంటే అది తాజాదని తెలుసుకోవచ్చు. అలాకాకుండా నల్లటి మచ్చలతో నిండి ఉంటే అది రోజుల తరబడి నిల్వ ఉందని అర్థం. ముదురు ఆకుపచ్చ రంగుతో ప్రకాశవంతంగా మెరుస్తుంటే మాత్రం నిల్వ ఉన్నదాని మీద రంగు వేశారని గుర్తించాలి.
బొండం చిన్న సైజులో ఉన్నప్పటికీ చేతిలోకి తీసుకోగానే బరువుగా అనిపిస్తే అది నీళ్లతో నిండి ఉందని గ్రహించాలి. పెద్దగా కనిపించినప్పటికీ అంత బరువు లేకుండా తేలికగా ఉంటే లోపల నీళ్లు ఎక్కువగా లేవని బొండం ముదిరిందని తెలుసుకోవచ్చు. అలా ముదిరినవాటిలో కొబ్బరి గట్టిపడి నీటి శాతం తగ్గడమే కాకుండా అందులోని ఎలకో్ట్రలైట్ల సమతుల్యత దెబ్బతిని ఉంటుంది. కాబట్టి వాటిని కొనకూడదు.
బొండాన్ని చెవిదగ్గర పెట్టుకుని ఊపితే నీటి శబ్దం ఎక్కువగా వినిపించినట్లయితే లోపల ఎక్కువ భాగం ఖాళీగా ఉందనీ, నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయని తెలుసుకోవాలి. అదే శబ్దం తక్కువగా ఓ లయలో వినిపిస్తే ఆ బొండం నీటితో నిండి ఉందని అర్థం.
తొడిమ భాగంలో పొడిగా గట్టిగా శుభ్రంగా ఉండాలి. అలా కాకుండా తడిగా ఉన్నా, బూజు కనిపించినా లోపల పాడైందని గుర్తించాలి. ఉపరితలంపై పగుళ్లు ఉన్నా, ఎక్కడనుంచైనా నీరు కారుతున్నట్లనిపించినా వాటిని కొనకూడదు. అలాంటివాటిలో హానికారక క్రిములు, బ్యాక్టీరియా చేరి నీటిని కలుషితం చేసే అవకాశం ఉంటుంది.
ఎండలో కుప్పగా పోసిన బొండాలను కొనకూడదు. ఎందుకంటే ఎండ వేడికి లోపలి నీరు సహజ గుణాలను కోల్పోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
ఇవి కూడా చదవండి..
డబ్ల్యూబీబీఎల్: బ్రిస్బేన్ హీట్ జట్టులో భారత క్రికెటర్‌కు చోటు!
భవనంపై నుంచి దూకి శాస్త్రవేత్త ఆత్మహత్య
రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ సభకు అనుమతి.. షరతులు విధించిన ఢిల్లీ పోలీసులు