Share News

మీగడతో ఫేస్‌ క్రీమ్‌

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:18 AM

శీతాకాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంటుంది. పెదాలు, బుగ్గలు పగిలి రక్తం చింది నొప్పిగా అనిపిస్తుంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు తాజా మీగడతో ఫేస్‌ క్రీమ్‌ను...

మీగడతో ఫేస్‌ క్రీమ్‌

శీతాకాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంటుంది. పెదాలు, బుగ్గలు పగిలి రక్తం చింది నొప్పిగా అనిపిస్తుంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు తాజా మీగడతో ఫేస్‌ క్రీమ్‌ను తయారుచేసుకుని వాడితే సరిపోతుంది.

ఏమేం కావాలంటే...

తాజా మీగడ- కప్పు, బాదం నూనె- రెండు చెంచాలు, తేనె- చెంచా, గులాబి నీళ్లు- రెండు చెంచాలు, గ్లిజరిన్‌- అర చెంచా, ఆలివ్‌ ఆయిల్‌ లేదా కొబ్బరి నూనె- రెండు చెంచాలు

ఇలా తయారుచేయాలి...

వెడల్పాటి గిన్నెలో మీగడను తీసుకోవాలి. ఫ్రిజ్‌లో నుంచి తీసుకున్నట్లయితే అది గది ఉష్ణోగ్రతకు వచ్చేదాకా ఆగాలి. ఆపైన క్రీమ్‌లా వచ్చే వరకు మీగడను బాగా బీట్‌ చేయాలి. తరువాత బాదం నూనె, ఆలివ్‌ లేదా కొబ్బరి నూనె, గ్లిజరిన్‌, తేనె వేసి మరోసారి బీట్‌ చేయాలి. చివరగా గులాబి నీళ్ల చుక్కలు వేసి చెంచాతో కలపాలి. అంతే ఫేస్‌ క్రీమ్‌ రెడీ! దీన్ని గాజు సీసాలోకి తీసుకుని గట్టిగా మూత బిగించి ఫ్రిజ్‌లో భద్రపరచుకోవాలి.

ఎప్పుడు రాసుకోవాలంటే...

రాత్రి పడుకునేముందు చూపుడు వేలితో కొద్దిగా క్రీమ్‌ను తీసుకుని ముఖానికి, మెడకు పట్టించాలి. కింది నుంచి పైకి దిశలో రెండు నిముషాలు సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఈ క్రీమ్‌ సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. మీగడలోని కొవ్వులు చర్మాన్ని తేమతో నింపి మృదువుగా మార్చేస్తాయి.

జాగ్రత్తలు...

ఈ క్రీమ్‌లో ఎలాంటి ప్రిజర్వేటివ్‌లు కలపలేదు కాబట్టి రెండు రోజులకు మించి నిల్వ ఉండదు. కాబట్టి కొద్ది కొద్దిగా మాత్రమే తయారు చేసుకుని వాడుకోవాలి. ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ క్రీమ్‌ రంగు, వాసనల్లో మార్పులు వచ్చాయనిపిస్తే దాన్ని ఉపయోగించకూడదు.

ఇవి కూడా చదవండి:

ప్రియా సరోజ్‌కు రింకూ సింగ్‌ బర్త్‌డే విషెస్‌..

వైభవ్ సూర్యవంశీ పెను విధ్వంసం.. 28 సిక్సర్ల వీడియో వైరల్!

Updated Date - Nov 25 , 2026 | 06:18 AM