మందార పూలతో షాంపూ...
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:37 AM
శిరోజాలు నల్లగా ఒత్తుగా పెరగడానికి పట్టు కుచ్చులా మెరవడానికి తోడ్పడే మందార పూల షాంపూని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం...
శిరోజాలు నల్లగా ఒత్తుగా పెరగడానికి పట్టు కుచ్చులా మెరవడానికి తోడ్పడే మందార పూల షాంపూని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం...
ముందుగా మందారం చెట్టు నుంచి ఆరు పూలు, పది ఆకులను తెచ్చుకుని వాటిని శుభ్రంగా కడగాలి. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి నీళ్లు పోసి ఆకులు, పూలు వేసి పది నిముషాలు మరిగించి చల్లార్చాలి. ఆపైన ఈ మిశ్రమాన్ని నీళ్లతో సహా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీయాలి. అందులో రెండు చెంచాల పెసర పిండి లేదా శీకాకాయ పొడి, చెంచా కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. అంతే మందార పూల షాంపూ రెడీ!
ఈ షాంపూని కుదుళ్లకు, శిరోజాలకు పట్టించాలి. ఆపైన తలపై కొద్దిగా నీటిని చిలకరించి చేతి వేళ్లతో అయిదు నిముషాలు మర్దన చేయాలి. పది నిముషాల తరువాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. కెమికల్ షాంపూ మాదిరి నురుగు రాకపోయినా శిరోజాల మీద పేరుకున్న జిడ్డు, మురికి పూర్తిగా తొలగిపోతాయి.
ఈ వార్తలనూ చదవండి:
డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక
భారత్ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక