అది హీట్ ఫీవర్ కావచ్చు
ABN , Publish Date - Apr 07 , 2026 | 03:58 AM
వేసవి వేడి పెరగడం వల్ల నీరసం, నిస్సత్తువ ఆవరిస్తే, దాన్ని ఎండదెబ్బగా భావిస్తూ ఉంటాం. కానీ అందుకు ‘హీట్ ఫీవర్’ కూడా కారణం కావచ్చు....
వేసవి వేడి పెరగడం వల్ల నీరసం, నిస్సత్తువ ఆవరిస్తే, దాన్ని ఎండదెబ్బగా భావిస్తూ ఉంటాం. కానీ అందుకు ‘హీట్ ఫీవర్’ కూడా కారణం కావచ్చు.
హీట్ ఫీవర్ ప్రతి జీవక్రియనూ ప్రభావితం చేస్తుందని ఫిజియాలజీ అండ్ ఫీవర్ అనే పుస్తకంలో ప్రచురితమైన ఒక పరిశోధన పేర్కొంటోంది. హైపోథలామ్‌సలోని థర్మోరెగ్యులేటరీ కేంద్రం ద్వారా శరీరం తన కోర్ ఉష్ణోగ్రతను నిర్వహిస్తూ ఉంటుంది. శరీరం విపరీతమైన వేడికి బహిర్గతమైనప్పుడు, సరిపడా నీళ్లు తాగకుండా ఎండలో ఎక్కువ గంటల పాటు నిలబడడం లాంటి పనులు చేసినప్పుడు, శరీరంలో నీటి శాతం తగ్గిపోయి మెదడు పనితీరు క్రమం తప్పుతుంది. దాంతో హృదయస్పందనలు అస్తవ్యస్థమై అంతిమంగా స్పృహ కోల్పోతాం.
హీట్ ఫీవర్‌లో ఏం జరుగుతుంది?
పర్యావరణంలోని ఉష్ణోగ్రత బేస్‌లైన్ ఉష్ణోగ్రత కంటే, 37 డిగ్రీల సెల్షియస్ లేదా 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు మించితే, శరీరం హీట్ ఫీవర్‌కు లోనవుతుంది.
ఆ సమయంలో...
చర్మం ఎర్రగా కందిపోతుంది. ప్రధానంగా ముఖం, చేతులు, కాళ్లు లేదా ఇతరత్రా ఎండకు బహిర్గతమయ్యే శరీర భాగాలు ఎరుపెక్కుతాయి. థర్మామీటరుతో పరీక్షించినప్పుడు జ్వరం కనిపిస్తుంది. డీహైడ్రేషన్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి
ఈ లక్షణాలు కనిపించిన వెంటనే శరీరం కోల్పోయిన లవణాలను, చక్కెరను భర్తీ చేసే ప్రయత్నం చేయాలి.
హీట్ స్ట్రోక్ అంటే ఎండదెబ్బ అత్యవసర వైద్య పరిస్థితి. ఈ స్థితిలో శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోతుంది. హీట్ ఫీవర్‌లో శరీర ఉష్ణోగ్రత కొద్దిమేరకే పెరుగుతుంది. ప్రధానంగా ఎండకు బహిర్గతమవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఎండదెబ్బకు ఎండకు బహిర్గతం కావలసిన అవసరం లేదు. నీడ పట్టున ఉన్నా ఎండదెబ్బ తగలవచ్చు
ఈ రెండు పరిస్థితులూ ఎండ, వేడి వల్లే తలెత్తినా, శరీరం మీద చూపించే ప్రభావాలు భిన్నంగా ఉంటాయి
కేంద్ర నాడీ వ్యవస్థ ఒత్తిడికి లోనవడం వల్ల హీట్ ఫీవర్‌కు లోనైతే, కణాల నుంచి ప్రొటీన్ల విడుదలను క్రమబద్ధీకరించే శరీర యంత్రాంగం గాడి తప్పడం వల్ల ఎండదెబ్బకు లోనవుతాం.
నివారణ ఇలా...
శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. అందుకోసం పండ్ల రసాలు, నీళ్లు, కొబ్బరినీళ్లు, ఆమ్ పన్నా, మజ్జిగ తరచూ తాగుతూ శరీర ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలి
ఎక్కువ సమయాలు నీడ పట్టున గడపాలి. చమటను పీల్చే కాటన్ దస్తులు వేసుకోవాలి.
వదులుగా, గాలి చొరబడే వీలుండే దుస్తులకు ప్రాధాన్యమివ్వాలి. జీన్స్ లాంటి మందపాటి దుస్తులకు ఈ కాలంలో దూరంగా ఉండాలి
సీజనల్ పండ్లు తింటూ ఉండాలి
వేడి వల్ల అసౌకర్యానికి లోనవుతున్నట్టు గ్రహించిన వెంటనే వైద్య సహాయం ఆశ్రయించాలి
ఈ వార్తలూ చదవండి:
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..