Share News

వీరికి క్యాన్సర్‌ దూరం

ABN , Publish Date - Aug 04 , 2026 | 03:29 AM

మూడు రకాల వ్యక్తులకు జీవితంలో క్యాన్సర్‌ సోకదని వైద్యులు నిర్థారిస్తున్నారు. వాళ్లెవరంటే...

వీరికి క్యాన్సర్‌ దూరం

తెలుసుకుందాం

మూడు రకాల వ్యక్తులకు జీవితంలో క్యాన్సర్‌ సోకదని వైద్యులు నిర్థారిస్తున్నారు. వాళ్లెవరంటే...

వ్యాయామం చేసేవాళ్లు:

క్రమం తప్పకుండా చర్మం మీద చమట తాలూకు ఉప్పు చారికలు ఏర్పడేలా వ్యాయామం చేసే వాళ్లకు క్యాన్సర్‌ దరి చేరదని వైద్యులంటున్నారు. సానా, భౌతిక శ్రమ, వేడి ఈ మూడు పనులూ క్యాన్సర్‌ను దరి చేరనివ్వవు. మూత్రానికి బదులుగా చమటతో, క్యాడ్మియం, ఆర్సెనిక్‌, లెడ్‌ అనే క్యాన్సర్‌కారక లోహాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. ఏళ్ల తరబడి చమట పట్టే వీల్లేకుండా, ఎసిల్లో పని చేసే ఉద్యోగులకూ, వ్యాయామాలకు దూరంగా ఉండే వారికీ ఈ అవకాశం ఉండదు. కాబట్టి వీళ్లకు క్యాన్సర్‌ ముప్పు ఎక్కువ.

ఆకలి పొట్ట కలిగినవాళ్లు:

కాస్త ఆకలిగా రాత్రుళ్లు నిద్రకు ఉపక్రమించేవాళ్ల జోలికి క్యాన్సర్‌ రాదు. సాధారణ కణాలతో పోల్చితే క్యాన్సర్‌ కణాలకు దురాశ ఎక్కువ. నిరంతర గ్లూకోజ్‌ లేకుండా అవి బ్రతికి ఉండలేవు. రాత్రివేళ కడుపు ఖాళీగా ఉంటే, చక్కెర, ఇన్సులిన్‌ మోతాదులు పడిపోయి, ఆటోఫజీ ప్రేరేపితమవుతుంది. దాంతో కణాలు, దెబ్బతిన్న కణాలను, క్యాన్సర్‌ కారక చెత్తనూ జీర్ణించుకుంటాయి. 13 గంటల పాటు రాత్రి ఉపవాసాలున్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ తిరగబెట్టే అవకాశాలు 36 శాతానికి పడిపోయినట్టు పరిశోధనల్లో రుజువైంది. బదులుగా రాత్రి 10 గంటలకు కడుపు నిండా తిన్నప్పుడు, ఆకలితో అలమటించాల్సిన కణాలకు ఆహారం అందుతుంది.

భావోద్వేగాలను బయల్పరిచేవారు:

కోపమొస్తే అరిచేయడం, ఏడుపొస్తే ఏడ్చేయడం.... ఇలా భావోద్వేగాలను క్షణాల్లో బహిర్గతం చేసి తేలికపడే వాళ్లలో కార్టిసాల్‌ హార్మోన్‌ అదుపులో ఉంటుంది. బదులుగా వాటిని అణచిపెట్టే వాళ్లలో కార్టిసాల్‌ క్రమేపీ పెరుగుతూ, ప్రతి రోజూ కొత్తగా పుట్టుకొచ్చే కణితి కణాలను నాశనం చేసే సహజసిద్ధ కణాలు క్షీణించిపోతాయి.

ఇవి కూడా చదవండి..

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..

Updated Date - Aug 04 , 2026 | 03:29 AM