Share News

వీటితో ఆరోగ్యంగా...

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:00 AM

ఉదయం పూట అల్పాహారం మానకూడదని నిపుణులు చెబుతుంటారు. ఆరోగ్యకరమైన ఈ అల్పాహారాలు తీసుకుంటే తక్షణ శక్తి ...

వీటితో ఆరోగ్యంగా...

ఉదయం పూట అల్పాహారం మానకూడదని నిపుణులు చెబుతుంటారు. ఆరోగ్యకరమైన ఈ అల్పాహారాలు తీసుకుంటే తక్షణ శక్తి లభించడమే కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రావు.

  • రకరకాల కూరగాయల ముక్కలతో తయారుచేసిన ఓట్స్‌ ఉప్మా తినడం వల్ల శరీరానికి పోషకాలు లభిస్తాయి. ఇది త్వరగా జీర్ణమవుతుంది కూడా.

  • ఇడ్లీని కూడా మంచి అల్పాహారంగా చెప్పవచ్చు. దీన్ని తయారుచేసేముందు పిండిలో కొన్ని క్యారట్‌ ముక్కలు, కొద్దిగా బీట్‌రూట్‌ తురుం, కొద్దిగా పాలకూర తరుగు కలుపుకుంటే ఆరోగ్యకరమైన టిఫిన్‌ రెడీ!

  • బ్రౌన్‌ బ్రెడ్‌ స్లయి్‌సలపై కీరా, క్యారట్‌, టమాటా ముక్కలు పరిచి కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి తయారుచేసిన వెజిటబుల్‌ శాండ్‌ విచ్‌ తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.

  • నానబెట్టిన అటుకులు, మొలకలు, పచ్చి బఠాణీలు, క్యారట్‌ ముక్కలతో తయారుచేసిన పోహా ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తినడం వల్ల చాలాసేపటి వరకు ఆకలిగా అనిపించదు. దీంతో శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు

  • అల్పాహారంగా తాజా పండ్లు, వాటితో తయారుచేసి స్మూతీలు, ఉడికించిన కోడిగుడ్లు, పలుచని మజ్జిగ కూడా తీసుకోవచ్చు. వీటివల్ల నీరసం ఆవహించదు.

  • వెడల్పాటి గిన్నెలో బొప్పాయి ముక్కలు, దానిమ్మ గింజలు, డ్రై ఫ్రూట్స్‌, మొలకలు, కార్న్‌ గింజలు, చెంచా ఆలివ్‌ నూనె వేసి బాగా కలిపి తింటే శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్‌ అందుతాయి. కడుపులో తేలికగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్

Updated Date - Apr 08 , 2026 | 05:00 AM