Share News

శిరోజాలకు పోషణ ఇలా...

ABN , Publish Date - Oct 22 , 2026 | 05:36 AM

శిరోజాలు రాలడం, చివర్లు చిట్లడం, చుండ్రు తదితర సమస్యలను నివారించి ఒత్తయిన తలకట్టుకు ఉపకరించే చిట్కాలివే...

శిరోజాలకు పోషణ ఇలా...

శిరోజాలు రాలడం, చివర్లు చిట్లడం, చుండ్రు తదితర సమస్యలను నివారించి ఒత్తయిన తలకట్టుకు ఉపకరించే చిట్కాలివే...

  • రాత్రి పడుకునేముందు గోరువెచ్చటి కొబ్బరినూనెను తలకు పట్టించి చేతి వేళ్లతో నెమ్మదిగా మర్దన చేసుకుని ఉదయాన్నే మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే మాడుమీద రక్తప్రసరణ మెరుగై కుదుళ్లు బలపడతాయి. తగినంత తేమ లభించడంతో శిరోజాలు సిల్కీగా మెరుస్తాయి కూడా.

  • అయిదారు చెంచాల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే మెత్తటి పేస్టులా రుబ్బాలి. దీన్ని మాడుకు, శిరోజాలకు పట్టించి అరగంటసేపు ఉంచాలి. ఆపైన గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తే శిరోజాలు మృదువుగా నిగారిస్తాయి.

  • రోజూ బియ్యం కడిగిన నీళ్లను ఓ స్ర్పే బాటిల్లో పోసుకుని ఉంచుకోవాలి. ఈ నీటిని తరచూ తలంతా స్ర్పే చేసుకుంటూ ఉంటే శిరోజాలు పొడిబారకుండా రంగు మారకుండా నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి.

  • ఓ కప్పు ఆవనూనెలో రెండు గుప్పెళ్ల కరివేపాకు వేసి బాగా మరిగించి వడబోసి తలకు రాసుకుని మర్దన చేసుకుంటే శిరోజాల సమస్యలన్నీ తీరిపోతాయి.

  • పది రోజులకోసారి మందారం పూలు, ఆకులను మెత్తగా నూరి తలకు ప్యాక్‌లా వేస్తే మంచి పోషణ లభించి శిరోజాలు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరుగుతాయి.

  • కొబ్బరి పాలు లేదా గ్రీన్‌ టీని తలకు పట్టించి అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో తలస్నానం చేసినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

ఈ వార్తలనూ చదవండి:

ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..

భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి

Updated Date - Oct 22 , 2026 | 05:36 AM