Share News

జామాకులతో ప్రయోజనాలెన్నో

ABN , Publish Date - Jun 25 , 2026 | 01:54 AM

కాల్షియం, పొటాషియం, సల్ఫర్‌, సోడియం, ఐరన్‌, మెగ్నీషియం లాంటి ఖనిజాలతోపాటు బి, సి విటమిన్లు అధికంగా ఉండే జామాకులు అందించే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...

జామాకులతో ప్రయోజనాలెన్నో

కాల్షియం, పొటాషియం, సల్ఫర్‌, సోడియం, ఐరన్‌, మెగ్నీషియం లాంటి ఖనిజాలతోపాటు బి, సి విటమిన్లు అధికంగా ఉండే జామాకులు అందించే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...

  • ఫ నాలుగైదు జామాకులను రెండు లవంగాలతో కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని దంతాలు, చిగుళ్లపై రాస్తే పంటి నొప్పి, చిగుళ్ల వాపు తదితర దంత సమస్యలు తొలగిపోతాయి. జామాకులను నమలడం వల్ల నోటి పూత తగ్గుతుంది. ఇది మౌత్‌ఫ్రెషనర్‌గా కూడా పనిచేస్తుంది.

  • ఫ జామాకులను మెత్తగా గ్రైండ్‌ చేసి రసాన్ని తీసి మంచినీటిలో కలుపుకొని తాగితే శరీరంలోని అదనపు కొవ్వులు కరిగిపోతాయి. ఊబకాయం దరిచేరదు.

  • ఫ తరచూ జామాకుల కషాయాన్ని తాగుతూ ఉంటే రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌ పేరుకోదు. దీంతో గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. మహిళల్లో నెలసరి సమస్యలు, అధిక రక్తస్రావం తగ్గుతాయి.

  • ఫ రెండురోజులకోసారి జామాకులు ఉడికించిన రసాన్ని తాగుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. టైప్‌ 2 మధుమేహంతో బాధపడేవారికి ఔషధంలా పనిచేస్తుంది.

  • ఫ ఉదయాన్నే జామాకులతో టీ తయారుచేసుకుని తాగితే జీర్ణక్రియ వేగవంతమవుతుంది. కడుపులో గ్యాస్‌, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు తొలగిపోతాయి.

  • ఫ వెడల్పాటి గిన్నెలో అయిదు జామాకులు వేసి గ్లాసు నీటిని పోసి పావుగంటసేపు ఉడికించాలి. ఈ నీటిని చల్లార్చి వడబోసి ముఖానికి పట్టిస్తే మొటిమలు తగ్గుతాయి. మాడుకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది. అలాగే జామాకుల పేస్టును వాడినా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!

టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!

Updated Date - Jun 25 , 2026 | 01:54 AM