Share News

చెట్లతో చక్కని ఆరోగ్యం

ABN , Publish Date - Jul 14 , 2026 | 04:40 AM

చెట్లతో నిండిన ప్రకృతిలో నడక ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తుందని పరిశోధనల్లో రుజువైంది. పచ్చని ప్రకృతి మనసును తేలికపరచడమే కాదు, చెట్ల నుంచి విడుదలయ్యే..

చెట్లతో చక్కని ఆరోగ్యం

చెట్లతో నిండిన ప్రకృతిలో నడక ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్నీ అందిస్తుందని పరిశోధనల్లో రుజువైంది. పచ్చని ప్రకృతి మనసును తేలికపరచడమే కాదు, చెట్ల నుంచి విడుదలయ్యే సుగంధభరిత సమ్మేళనాలు ఒత్తిడిని తొలగిస్తాయి. మరిన్ని వివరాలు....

ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటలు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య చెట్లు ఫైటాన్‌సైడ్స్‌ అనే సుగంధభరిత సమ్మేళనాలను గరిష్ఠంగా విడుదల చేస్తాయి. వీటిని పీల్చుకోవడం వల్ల....

  • ఒత్తిడి హార్మోన్‌ కార్టిసాల్‌ తగ్గుతుంది

  • ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే ప్రొటీన్‌ తగ్గుతుంది

  • గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది

  • మనసు, శరీరం సేద తీరతాయి

  • సహజసిద్ధ కణ కార్యకలాపాలు పెరుగుతాయి

ప్రత్యామ్నాయాలున్నాయి

ఫిర్‌: ప్రకృతిలో నడక సాధ్యపడని వారు చెట్ల ఎసెన్షియల్‌ నూనెలను కూడా వాడుకోవచ్చు. ఫిర్‌ ఎసెన్షియల్‌ నేనెను పీల్చడం వల్ల మనసు చురుకుదనం పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు, అలసట దూరమవుతాయని పలు అధ్యయనాల్లో తేలింది.

హినోకి: ఈ ఎసెన్షియల్‌ నూనెను పీల్చుకోవడం వల్ల, వ్యాధికారక కణాలను సంహరించే న్యాచురల్‌ కిల్లర్‌ సెల్స్‌ అనే తెల్ల రక్తకణాలు పెరుగుతాయని మరొక అధ్యయనంలో తేలింది తెలుసుకుందాం

ఈ వార్తలనూ చదవండి:

హెలికాప్టర్ మెషిన్‌గన్‌ను నేలపై కాల్చే ప్రయత్నం.. చివరికి ఏమైందంటే..

ఇరాన్ హిట్‌లిస్ట్‌లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ..

Updated Date - Jul 14 , 2026 | 04:40 AM