Share News

ఎగ్జామ్‌ ఫీవర్‌ వర్సెస్‌ సమ్మర్‌ హీట్‌

ABN , Publish Date - Mar 09 , 2026 | 02:55 AM

పరీక్షల సమయం అంటేనే ఒత్తిడి, దీనికి తోడు పెరుగుతున్న ఎండలు పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఈ సమయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి....

ఎగ్జామ్‌ ఫీవర్‌ వర్సెస్‌ సమ్మర్‌ హీట్‌

పరీక్షల సమయం అంటేనే ఒత్తిడి, దీనికి తోడు పెరుగుతున్న ఎండలు పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఈ సమయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి.

బ్రెయిన్‌ ఫుడ్‌: పరీక్షల సమయంలో పిల్లలకు నట్స్‌ (బాదం, వాల్‌నట్స్‌), గుమ్మడి గింజలు ఇవ్వండి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మరీ ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండే ఆహారం మెదడును చురుగ్గా ఉంచుతుంది.

హైడ్రేషన్‌ అండ్‌ కాన్సంట్రేషన్‌: పిల్లలు చదువుకునేటప్పుడు పక్కనే ఒక వాటర్‌ బాటిల్‌ ఉంచండి. మెదడు డీహైడ్రేషన్‌కు గురైతే త్వరగా అలసట, తలనొప్పి వస్తాయి. గ్లూకోజ్‌ లేదా కొబ్బరి నీళ్లు ఇస్తే తక్షణ శక్తి అందుతుంది.

లైట్‌ డిన్నర్‌.. సౌండ్‌ స్లీప్‌: రాత్రిపూట భారీ భోజనం పెడితే ఉదయాన్నే లేవలేరు, మగతగా ఉంటుంది. తేలికపాటి ఆహారం ఇచ్చి కనీసం 6-7 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. నిద్ర సరిగ్గా ఉంటే చదివింది గుర్తుంటుంది.

టైం బ్రేక్స్‌: చదువు మధ్యలో బ్రేక్‌ అంటే మొబైల్‌ చూడటం కాదు. కాసేపు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవడం. లేదా బాల్కనీలోకి వెళ్లి గాలి పీల్చుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

చల్లని వాతావరణం: మధ్యాహ్నం వేళలో పరీక్షలు ఉంటే పిల్లలు ఇంటికి రాగానే ఐస్‌ వాటర్‌ కాకుండా కాస్త చల్లని మజ్జిగ ఇవ్వండి. వారు చదువుకునే గదిలో తగినంత గాలి, వెలుతురు ఉండేలా చూడండి.

ఇవి కూడా చదవండి:

254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్

అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

Updated Date - Mar 09 , 2026 | 02:56 AM