ఆ వ్యాధులను నివారించాలంటే?
ABN , Publish Date - Apr 02 , 2026 | 05:42 AM
సుఖ వ్యాధులకు సమర్ధమైన చికిత్సలున్నాయి. అయితే వ్యాధి మీదే చికిత్స ఆధారపడి ఉంటుంది. కొన్ని సుఖ వ్యాధులు (ట్రైఖోమోనాస్) యాంటీబయాటిక్స్‌తో అదుపులోకొస్తాయి. అయితే...
కౌన్సెలింగ్
డాక్టర్! సుఖ వ్యాధులకు సమర్ధ చికిత్సలు ఉన్నాయా? వీటిని ఎంతవరకూ రూపుమాపగలిగే వీలుంది?
- ఓ సోదరి, వరంగల్
సుఖ వ్యాధులకు సమర్ధమైన చికిత్సలున్నాయి. అయితే వ్యాధి మీదే చికిత్స ఆధారపడి ఉంటుంది. కొన్ని సుఖ వ్యాధులు (ట్రైఖోమోనాస్) యాంటీబయాటిక్స్‌తో అదుపులోకొస్తాయి. అయితే తిరిగి రెండోసారి అదే వ్యాధికి గురయితే చికిత్స కొంత క్లిష్టం కావచ్చు. మరికొన్ని సుఖవ్యాధులు ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు పునరుత్పత్తి సామర్థ్యంపైనా ప్రభావం చూపిస్తాయి. అలాగే ఒకే సమయంలో పలు రకాల సుఖవ్యాధులు సోకే ప్రమాదం కూడా లేకపోలేదు. వ్యాధులు సోకినప్పుడు మీతోపాటు మీ భాగస్వామి కూడా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
జెనిటల్ వార్ట్స్: ఈ పుండ్లు వైరస్‌వల్ల వస్తాయి. పుండ్ల మీద రసాయన లేపనం పూయడంతోపాటు, లేజర్ ట్రీట్మెంట్, సర్జరీ, యాంటీవైరల్ మందులతో వైర్‌సనుసమూలంగా తొలగించవచ్చు
క్లామీడియా: బ్యాక్టీరియా వల్ల సోకే ఈ వ్యాధికి ఒక రోజు లేదా రోజుల తరబడి సాగే మందుల కోర్సు తీసుకోవాలి.
గనేరియా: బ్యాక్టీరియా వల్ల సోకే ఈ సుఖ వ్యాధికి కూడా ఒక రోజు లేదా రోజుల తరబడి సాగే మందుల కోర్సు తీసుకోవాలి
జెనిటల్ హెర్పిస్: వైరస్ వల్ల సోకే ఈ వ్యాధి రెండు నుంచి మూడు వారాల్లో బయల్పడుతుంది. ఈ వైర్‌సను మందులతో శరీరం నుంచి సమూలంగా తొలగించడం అసాధ్యం. మొదటి విడత లక్షణాలను తగ్గించడం కోసం యాంటీవైరల్ మందులు వాడాలి. రెండో విడతలో మందుల ప్రభావం తగ్గుతుంది. ఇలా పదే పదే తిరగబెడుతుంటే కనీసం ఆరు నెలలు మందులు వాడాలి.
డాక్టర్ షర్మిలా మజుందార్
సెక్సాలజిస్ట్ అండ్ సైకో అనలిస్ట్, హైదరాబాద్
ఇవి కూడా చదవండి...
అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత
మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్
Read Latest AP News And Telugu News