రోజూ గుడ్లు తింటే?
ABN , Publish Date - Apr 07 , 2026 | 03:54 AM
కొలీన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే గుడ్లతో మెదడు చురుకుదనం, మంచి కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు చర్మం, కంటి ఆరోగ్యం కూడా...
గుడ్లు కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారమే! అయితే గుడ్లు రోజూ తినొచ్చా?
కొలీన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే గుడ్లతో మెదడు చురుకుదనం, మంచి కొలెస్ట్రాల్ పెరగడంతో పాటు చర్మం, కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నిజానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను పొందగలిగే శులభమైన మార్గం గుడ్లు తినడం. అయితే గుడ్లు రోజూ తినొచ్చా? అనే సందేహం ఎంతో మందిని వేధిస్తూ ఉండొచ్చు. ఎలాంటి సందేహం లేకుండా గుడ్లను ప్రతి రోజూ తినొచ్చనీ, 14రోజుల పాటు ప్రతి రోజూ గుడ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చనీ ఎయిమ్స్‌లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డాక్టర్ సౌరభ్ సేథీ అంటున్నారు.
జ్ఞాపకశక్తికీ, ఏకాగ్రతకూ కీలకమైన అసిటైల్‌క్లోరీన్ అనే న్యూరోట్రాన్స్‌మీటర్ ఉత్పత్తిని పెంచే కోలీన్ గుడ్లలో పుష్కలంగా ఉంటుంది.
హై డెన్సిటీ లైపోప్రొటీన్ అనే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది
గుడ్డు పచ్చసొనలో లుటీన్, జీక్సాంథిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నీలి కాంతి నుంచి కంటికి రక్షణ కల్పిస్తాయి.
గుడ్లలో సల్ఫర్‌తో కూడిన అమీనో ఆమ్లాలుంటాయి.
గుడ్లు పచ్చసొనలో విటమిన్ ఎ, ఇ, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. అయినప్పటికీ దీన్లోని కొలెస్ట్రాల్ పరిమాణం మూలంగా గుడ్డు పచ్చసొన పట్ల పలు అపోహలు నెలకొని ఉన్నాయి. కానీ నిజానికి కణ నిర్మాణం, హార్మోన్ ఉత్పత్తి, మెదడు పనితీరు, ఆరోగ్యకరమైన వ్యాధినిరోధకశక్తికి గుడ్డు పచ్చసొన ఎంతో కీలకం. కాబట్టి గుడ్డును పచ్చసొనతో పాటు తినడం అలవాటు చేసుకోవాలి.
ఈ వార్తలూ చదవండి:
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..