గ్యాస్ ఆదా ఇలా...
ABN , Publish Date - Jun 17 , 2026 | 03:43 AM
వంట చేసేటప్పుడు గ్యాస్ వినియోగాన్ని తగ్గించే సాధారణ చిట్కాలివే...
వంట చేసేటప్పుడు గ్యాస్ వినియోగాన్ని తగ్గించే సాధారణ చిట్కాలివే...
వంటను ప్రారంభించడానికి ముందే కావాల్సిన పదార్థాలన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల అనవసరంగా స్టవ్ ఆన్‌లో ఉండే సమయం తగ్గుతుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది.
ప్రెజర్ పాన్, కుక్కర్‌లను వాడడం వల్ల వంట సమయం తద్వారా గ్యాస్ వినియోగం తగ్గుతాయి.
వంటకానికి అవసరమైనంత నీటిని మాత్రమే వినియోగిస్తే వంట త్వరగా పూర్తయి గ్యాస్ ఆదా అవుతుంది.
వంట చేసేటప్పుడు పాత్రలపై మూతపెడితే ఆహారపదార్థాలు త్వరగా వేడెక్కి వేగంగా ఉడుకుతాయి.
ఫ్రిజ్ నుంచి పాలు, కూరగాయలను ముందుగానే బయటికి తీసి అవి గది ఉష్ణోగ్రతకు చేరుకున్నాకే వంటకు వినియోగించాలి. దీనివల్ల చాలావరకు గ్యాస్ ఆదా అవుతుంది.
స్టవ్ బర్నర్లను రోజూ శుభ్రం చేస్తుంటే మంట సక్రమంగా వచ్చి వంట త్వరగా పూర్తవుతుంది. బర్నర్ల పరిమాణానికి తగ్గ అడుగు భాగం ఉండే పాత్రలను మాత్రమే వంటకు వినియోగించాలి. దీనివల్ల వేడి వృథా కాదు.
చిన్న మంట మీద ఎక్కువసేపు వండే బదులు మధ్యస్థ లేదా పెద్ద మంటలను
వినియోగిస్తూ వంటను త్వరగా పూర్తి చేయాలి.
పిండి వంటలు చేసేటప్పుడు వెడల్పాటి మందమైన మూకుడును వాడుతూ పెద్ద మంట మీద తయారీ ప్రక్రియను త్వరత్వరగా పూర్తిచేయాలి.
ఇవి కూడా చదవండి..
నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..
సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..