నోరు తడారిపోతోందా?
ABN , Publish Date - Jun 24 , 2026 | 06:13 AM
ఒక్కోసారి నోరు, నాలుక, పెదవులు తడారిపోతుంటాయి. గ్లాసులకొద్దీ మంచినీటిని తాగినా ఫలితం కనిపించదు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు పాటించాల్సిన చిన్న చిట్కాలివే...
ఒక్కోసారి నోరు, నాలుక, పెదవులు తడారిపోతుంటాయి. గ్లాసులకొద్దీ మంచినీటిని తాగినా ఫలితం కనిపించదు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు పాటించాల్సిన చిన్న చిట్కాలివే...
నోట్లో సోంపు గింజలు వేసుకుని నెమ్మదిగా నములుతూ ఉంటే ప్రయోజనం ఉంటుంది. సోంపుతో తయారుచేసిన కషాయం తాగినా సమస్య తీరుతుంది.
ఒక గ్లాసు కొబ్బరి బోండాం నీళ్లలో చెంచా పటిక బెల్లం, చిటికెడు యాలకుల పొడి వేసి బాగా కలిపి తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
బాటిల్‌లో చల్లటి నీటిని తీసుకుని నోటి లోపల, పెదవులపై కొద్ది కొద్దిగా స్ర్పే చేస్తున్నా సమస్య తీరుతుంది.
చక్కెర లేని చూయింగ్ గమ్‌ను నములుతుంటే మెల్లగా లాలాజలం ఊరి నోరంతా తేమగా మారుతుంది.
రాత్రి పడుకునేముందు పడకగదిలో కూల్ మిస్ట్ హ్యుమిడిఫయర్‌ను ఏర్పాటు చేసుకుంటే నోరు తడారిపోయే సమస్య రాదు.
మసాలాలు, అధిక ఉప్పు, వేపుళ్లు, డ్రై స్నాక్స్ తదితరాలను ఎక్కువగా తినకూడదు. గోరు వెచ్చటి సూప్‌లు, పలుచటి మజ్జిగ, తాజా పండ్లను తరచూ తీసుకుంటుంటే నోరంతా తేమతో నిండుతుంది.
ఒక కప్పు గోరు వెచ్చటి నీటిలో పావు చెంచా బేకింగ్ సోడా, పావు చెంచా ఉప్పు వేసి కలిపిన నీటితో తరచూ నోటిని పుక్కిలిస్తూ ఉంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి