Share News

చదువు.. అవార్డులు.. కుటుంబం

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:28 AM

విశాఖకు చెందిన శాంతిలత ఏవీఎన్‌ కళాశాలలో బీఎస్సీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాథాలజీలో రొమ్ము క్యాన్సర్‌పై...

చదువు.. అవార్డులు.. కుటుంబం

విశాఖకు చెందిన శాంతిలత ఏవీఎన్‌ కళాశాలలో బీఎస్సీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాథాలజీలో రొమ్ము క్యాన్సర్‌పై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు. 2018లో గీతం మెడికల్‌ కాలేజీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా చేరి తన ఆవిష్కరణకు తుది రూపమిచ్చారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ యూనివర్సిటీ నుంచి అవార్డు, హాంకాంగ్‌ యూనివర్సిటీ నుంచి గ్లోబల్‌ హెల్త్‌ అవార్డులు లభించాయి. శాంతిలత తండ్రి శంకరరావు లీగల్‌ సలహాదారు. తల్లి రాజ్యలక్ష్మి గృహిణి. కుమారుడు శ్రీదత్త ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. వృత్తిరీత్యా శాంతిలత ఎంత బిజీగా ఉన్నా సెలవు రోజుల్లో ఆమె విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా వివరిస్తూ సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. ‘క్యాన్సర్‌ను ముందుగా గురిస్తే అది ప్రాణాంతకం కాదు’ అని చెబుతున్న డాక్టర్‌ శాంతిలత వంటివారి కృషి దేశానికి గర్వకారణం. ఒక సామాన్య మధ్యతరగతి మహిళగా మొదలై, లక్షలాదిమంది ప్రాణాలను కాపాడే దిశగా ఆమె వేసిన అడుగులు ఎందరికో స్ఫూర్తిదాయకం.

ఇవి కూడా చదవండి:

వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..

డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా

Updated Date - Mar 16 , 2026 | 12:28 AM