వైద్య విప్లవ కారిణి
ABN , Publish Date - Nov 21 , 2026 | 04:51 AM
సామాజిక వివక్షను అధిగమించి భారత తొలి ట్రాన్స్‌జెండర్ వైద్య ప్రొఫెసర్లలో ఒకరిగా ఎదిగిన డాక్టర్ అక్సా షేక్.. వైద్య రంగంలో సమ్మిళిత సంస్కరణల కోసం...
సామాజిక వివక్షను అధిగమించి భారత తొలి ట్రాన్స్‌జెండర్ వైద్య ప్రొఫెసర్లలో ఒకరిగా ఎదిగిన డాక్టర్ అక్సా షేక్.. వైద్య రంగంలో సమ్మిళిత సంస్కరణల కోసం పోరాడుతున్నారు. అణగారిన వర్గాలకు సమానమైన వైద్య హక్కులు కల్పించేందుకు ఆమె చేస్తున్న కృషికి ‘టైమ్స్ 100 నెక్ట్స్ ఇండియా 2026’ జాబితాలో చోటు లభించింది. ముంబైలో జన్మించిన అక్సా షేక్.. చిన్నతనం నుంచే లింగ గుర్తింపు పరంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ ప్రతిష్ఠాత్మక కేఈఎం ఆసుపత్రి నుంచి ఎంబీబీఎస్, కమ్యూనిటీ మెడిసిన్‌లో ఎండీ పూర్తి చేశారు. 2013లో తన లింగమార్పిడి ప్రక్రియను పూర్తి చేసుకుని బహిరంగంగా ట్రాన్స్‌విమెన్‌గా గుర్తింపును చాటుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ హమ్‌దర్ద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
కొవిడ్ సమయంలో ఢిల్లీలో వ్యాక్సినేషన్ కేంద్రానికి నాయకత్వం వహించిన తొలి ట్రాన్స్‌జెండర్ వైద్యురాలిగా డాక్టర్ అక్సా చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేయడంతో పాటు, వైద్య పాఠ్యాంశాలలో ‘ఎల్‌జీబీటీక్యూఐఏ ప్లస్’ అంశాలను శాస్త్రీయంగా చేర్చాలని నేషనల్ మెడికల్ కమిషన్ వద్ద బలంగా వాదించారు. సుప్రీంకోర్టు టాస్క్‌ఫోర్స్, ట్రాన్స్‌జెండర్ హక్కుల సలహా కమిటీలలో నిపుణురాలిగా పనిచేస్తూ ప్రజా ఆరోగ్య రంగంలో సరికొత్త మార్పుకు నాయకత్వం వహిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..