Share News

అన్నం మోతాదు ముఖ్యం

ABN , Publish Date - Nov 03 , 2026 | 03:07 AM

మధుమేహులు అన్నం బదులు బ్రౌన్‌ రైస్‌, చపాతీలు, ఓట్స్‌ను ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఏ ఆహారం ఎంచుకున్నా పిండిపదార్థాలు...

అన్నం మోతాదు ముఖ్యం

మధుమేహం

మధుమేహులు అన్నం బదులు బ్రౌన్‌ రైస్‌, చపాతీలు, ఓట్స్‌ను ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఏ ఆహారం ఎంచుకున్నా పిండిపదార్థాలు, పోషక మోతాదుల మీద దృష్టి పెట్టడం అవసరం. అన్నం పరిమాణంతో పాటు, ఆహారంలో కూరగాయలు, ప్రొటీన్‌ మోతాదుల మీద కూడా దృష్టి పెట్టాలి. అన్నంతో మధుమేహం ముప్పు తప్పాలంటే...

  • భోజనం ప్లేట్లో అన్నం ఎక్కువ భాగాన్ని ఆక్రమించకూడదు

  • పప్పు, బీన్స్‌, గుడ్లు, పన్నీర్‌, చేప.. ఇలా అన్నాన్ని ఏదో ఒక ప్రొటీన్‌తో కలిపి తినాలి

  • పాలకూర, క్యాబేజీ, బీన్స్‌, సొరకాయ ఇలా స్టార్చ్‌ లేని కూరగాయలు జోడించాలి

చల్లబరిచి తింటే: అన్నాన్ని చల్లబరిచి తినడం వల్ల రక్తంలో చక్కెర పెరగదని వింటున్నాం. దీన్లో కొంతమేరకు నిజం లేకపోలేదు. వండి చల్లబరిచిన తర్వాత దాన్లోని రెసిస్టెంట్‌ స్టార్చ్‌ వేగంగా జీర్ణం కాదు కాబట్టి రక్తంలో గ్లూకోజ్‌ వేగంగా పెరగదు. అయితే అన్నాన్ని చల్లబరిచినంత మాత్రాన దాన్లోని పిండిపదార్థాలు తగ్గిపోవనే విషయం గుర్తు పెట్టుకోవాలి. అలాగే మోతాదును పరిమితం చేస్తూ, ఫ్రిజ్‌లో నిల్వ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. వండిన అన్నాన్ని గది ఉష్ణోగ్రత దగ్గర ఎక్కువ గంటల పాటు వదిలేయకుండా, చల్లారిన వెంటనే ఫ్రిజ్‌లో భద్రపరుచుకుని, తినబోయే ముందు వేడి చేసుకోవాలి. తెల్లన్నంతో పోల్చితే బ్రౌన్‌ రైస్‌లో పీచు ఎక్కువ కాబట్టి కొంతమేరకు ప్రయోజనం ఉంటుంది. అయితే తెల్లన్నం మాదిరిగనే బ్రౌన్‌ రైస్‌ను కూడా పరిమితంగానే తినాలి.

ఈ వార్తలూ చదవండి

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు

మురసు తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌డీఎంఏ

Updated Date - Nov 03 , 2026 | 03:07 AM