మోచేతులు మెరిసేలా...
ABN , Publish Date - Jun 17 , 2026 | 02:52 AM
మోచేతులపై నల్లటి మచ్చలను తొలగించే ఇంటి చిట్కాలివే...
మోచేతులపై నల్లటి మచ్చలను తొలగించే ఇంటి చిట్కాలివే...
చిన్న గిన్నెలో అర చెంచా పసుపు, చెంచా తేనె వేసి బాగా కలిపిన మిశ్రమాన్ని మోచేతులకు పట్టించాలి. అరగంట తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే తేమతో నిండి మోచేతులు రంగు తిరుగుతాయి.
బంగాళదుంపను మధ్యకు కోసి దానితో మోచేతులపై పావుగంటసేపు మర్దన చేయాలి. లేదా మోచేతులపై బంగాళదుంప రసాన్ని రాసి అరగంటసేపు ఆరనివ్వాలి. ఆపైన చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
వాడేసిన నిమ్మచెక్కతో మోచేతులపై నెమ్మదిగా రుద్ది పావుగంటసేపు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే నలుపుదనం విరిగి గరుకుదనం తగ్గి మోచేతులు ఛాయగా మృదువుగా మారుతాయి.
గిన్నెలో చెంచా బేకింగ్ సోడా వేసి తగినంత నీటిని చిలకరించి పేస్టులా చేయాలి. దీన్ని మోచేతులకు పట్టించి మెల్లగా మర్దన చేయాలి. పది నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది.
రాత్రి పడుకునేముందు మోచేతులకు కలబంద గుజ్జు లేదా గ్రీన్ టీ ద్రావణాన్ని పట్టించి ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేసుకున్నా ప్రయోజనం ఉంటుంది.
గిన్నెలో చెంచా ఆలివ్ ఆయిల్, అరచెంచా చక్కెర వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులకు పట్టించి నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ పెరిగి మోచేతులపై చర్మం నిగారిస్తుంది.
గిన్నెలో చెంచా పెరుగు, చెంచా కాఫీ పొడి వేసి బాగా కలిపిన మిశ్రమాన్ని మోచేతులకు పట్టించాలి. కొద్దిగా ఆరిన తరువాత పది నిమిషాలు మర్దన చేసి గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే ట్యాన్ తొలగి మోచేతులు ఛాయగా మెరుస్తాయి.
రోజూ మాయిశ్చరైజర్ రాసుకుని మర్దన చేసుకుంటుంటే మోచేతులు నలుపెక్కవు.
ఇవి కూడా చదవండి..
నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..
సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..