Share News

కరివేపాకు తాజాగా...

ABN , Publish Date - Mar 09 , 2026 | 03:03 AM

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరివేపాకు త్వరగా ఎండిపోతూ ఉంటుంది. అలాకాకుండా ఎక్కువరోజులపాటు కరివేపాకును తాజాగా ఉంచే చిట్కాలివే...

కరివేపాకు తాజాగా...

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరివేపాకు త్వరగా ఎండిపోతూ ఉంటుంది. అలాకాకుండా ఎక్కువరోజులపాటు కరివేపాకును తాజాగా ఉంచే చిట్కాలివే...

  • కరివేపాకు రెమ్మలను మంచినీటితో కడిగి ఆకులను తుంచి ఆరబెట్టాలి. ఆపైన వీటిని జిప్‌లాక్‌ కవర్లో వేసి గాలి చొరబడకుండా సీల్‌ మూసి ఫ్రీజర్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల కరివేపాకు నెల వరకూ తాజాగా ఉంటుంది.

  • కరివేపాకును పలుచని రుమాలుతో తేమ లేకుండా తుడిచి పేపర్లో చుట్టి గాజు సీసాలో ఉంచాలి. ఈ సీసాను ఫ్రిజ్‌లో ఉంచితే చాలా రోజులపాటు కరివేపాకు తాజాగా ఎండిపోకుండా ఉంటుంది.

  • కరివేపాకును శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టాలి. ఆకులు పూర్తిగా ఆరిన తరువాత ఒక ప్లాస్టిక్‌ డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెడితే వారంపాటు తాజాగా ఉంటాయి.

  • కరివేపాకును ఐస్‌ ట్రేలో వేసి నిండా నీళ్లు పోసి ఫ్రీజర్లో ఉంచాలి. అవసరం ఉన్నప్పుడు వీటిని వాడుకోవచ్చు.

  • ఒక ప్లాస్టిక్‌ డబ్బాలో కరివేపాకును వేసి పైన పేపర్‌ను ఉంచి గట్టిగా మూత బిగించాలి. ఈ డబ్బాను ఫ్రిజ్‌లో ఉంచితే కరివేపాకు రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది.

  • కరివేపాకును మిగిలిన కూరగాయలతో కలిపి ఉంచకుండా విడిగా భద్రపరిస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్

అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

Updated Date - Mar 09 , 2026 | 03:03 AM