కాళ్లు పగులుతున్నాయా..?
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:35 AM
వేసవిలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గిపోతూ ఉంటుంది. దీంతో చర్మం పొడిబారి మడమలు పగులుతూ ఉంటాయి. చిన్న చిట్కాలతో...
వేసవిలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గిపోతూ ఉంటుంది. దీంతో చర్మం పొడిబారి మడమలు పగులుతూ ఉంటాయి. చిన్న చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
పాదాలకు తరచూ మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉండాలి. దీంతో చర్మం తేమతో నిండి పగలకుండా ఉంటుంది.
పాదాలకు కాటన్ సాక్స్ వేసుకోవడం మంచిది. దీనివల్ల చర్మానికి ఎండ, దుమ్ము, కాలుష్యం సోకకుండా ఉంటాయి.
బయట ఎక్కువగా తిరిగేవారికి పాదాల్లో, మడమల వద్ద మట్టి, మురికి ఎక్కువగా చేరుతూ ఉంటాయి. కాబట్టి ఇంటికి రాగానే పాదాలను గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
వెడల్పాటి టబ్‌లో గోరువెచ్చటి నీటిని తీసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, బేబీ షాంపూ వేసి బాగా కలపాలి. ఆ నీటిలో పాదాలు మునిగేలా ఉంచాలి. అరగంట తరువాత పాదాలను పాత టూత్‌బ్రష్‌తో శుభ్రం చేయాలి. ఆపైన మంచినీటితో కడిగి పొడిగా ఉండేలా తుడవాలి. రాత్రి పడుకునేముందు పాదాలకు కొద్దిగా కొబ్బరినూనె లేదా ఆలివ్ నూనె రాయాలి. ఇలా వారం రోజులు చేస్తే పాదాలు, మడమల పగుళ్లు తగ్గుతాయి.
చిన్న గిన్నెలో నాలుగు చెంచాల బియ్యప్పిండి, రెండు చెంచాల తేనె లేదా యాపిల్ సైడర్ వెనిగర్ వేసి తగినన్ని నీళ్లు చిలకరించి పేస్టులా చేయాలి. పాదాలను శుభ్రం చేసుకున్న తరువాత ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా పట్టించాలి. అరగంట తరువాత చేతివేళ్లతో మెల్లగా రుద్దుతూ పిండిని తొలగించాలి. ఆపైన మంచినీటితో పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే చర్మానికి తేమ అంది పగుళ్లు తగ్గుతాయి.
ఇవి కూడా చదవండి..
ప్రతీకారమే.. మధ్యవర్తి దేశాలకు తేల్చిచెప్పిన మొజ్తాబా
ఇరాన్ సెక్యూరిటీ చీఫ్‌ను చంపేశాం.. ఇజ్రాయెల్ ప్రకటన