Share News

చక్కెరతో ఇలా కూడా...

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:27 AM

చక్కెరతో రకరకాల తీపిపదార్థాలు తయారుచేయడమే కాదు చిన్న చిట్కాలు పాటించి పలు సమస్యల నుంచి బయటపడవచ్చు...

చక్కెరతో ఇలా కూడా...

చక్కెరతో రకరకాల తీపిపదార్థాలు తయారుచేయడమే కాదు చిన్న చిట్కాలు పాటించి పలు సమస్యల నుంచి బయటపడవచ్చు.

  • మిక్సీ గిన్నెలకు తరచూ ఘాటైన వాసనలు పట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిలో రెండు చెంచాల చక్కెర వేసి ఒక నిమిషం పాటు గ్రైండ్‌ చేసి ఆపైన కడిగేస్తే సరిపోతుంది.

  • ఖాళీ డబ్బాలు, సీసాలు, వాటర్‌ బాటిళ్లను ఎక్కువ కాలం ఉపయోగించకపోతే వాసన వస్తుంది. వాటిలో చిటికెడు పంచదార వేసి మూతపెడితే చాలు.

  • చిన్న గిన్నెలో రెండు చెంచాల నిమ్మరసం, రెండు చెంచాల చక్కెర వేసి కలిపిన మిశ్రమాన్ని తుప్పు పట్టిన వస్తువులపై వేసి స్క్రబ్బర్‌తో రుద్ది కడిగితే వెంటనే అవి శుభ్రపడతాయి.

  • చేతులకు గ్రీజు, జిడ్డు లాంటివి అంటుకున్నప్పుడు లిక్విడ్‌ హ్యాండ్‌వా్‌షతోపాటు కొద్దిగా చక్కెరను కూడా తీసుకుని బాగా రుద్ది నీళ్లతో కడిగేసుకుంటే సమస్య తీరుతుంది. అలాగే చేపలు, ఉల్లిపాయలు, ముల్లంగి లాంటి వాటిని తరగడం వల్ల చేతులకు పట్టిన వాసనలను తొలగించడంలో కూడా ఈ చిట్కా ఉపకరిస్తుంది.

  • ఒక గిన్నెలో చెంచా చక్కెర, పావు చెంచా బేకింగ్‌ పౌడర్‌ వేసి కొన్ని నీళ్ల చుక్కలు చిలకరించి పేస్టులా చేయాలి. దీన్ని స్క్రబ్బర్‌తో అద్ది తోమితే వంటపాత్రలకు పట్టిన జిడ్డు, వాసనలు, మాడు మరకలు తొలగిపోతాయి.

  • ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటే నోట్లో కొద్దిగా చక్కెర వేసుకుని నమిలితే వెంటనే అవి ఆగిపోతాయి.

  • చిన్న గిన్నెలో రెండు చెంచాల చక్కెర, చెంచా కొబ్బరి నూనె లేదా గ్లిజరిన్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సహజ బాడీ స్క్రబ్‌లా ఉపయోగించుకోవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మారుస్తుంది.

ఇవి కూడా చదవండి

మచిలీపట్నంలో భారీ చోరీ.. ఉపాధ్యాయురాలి ఇంట్లో 50 తులాల బంగారం దొంగతనం

మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Feb 26 , 2026 | 02:27 AM