ఫ్యాన్ గాలి చల్లగా...
ABN , Publish Date - Mar 29 , 2026 | 01:31 AM
వేసవిలో మధ్యాహ్నం వేళ సీలింగ్ ఫ్యాన్ వేసుకున్నప్పటికీ ఉక్కపోత తీరదు. అలాంటప్పుడు ఫ్యాన్ గాలి ఎక్కువగా చల్లగా రావాలంటే ఏ చిట్కాలు...
వేసవిలో మధ్యాహ్నం వేళ సీలింగ్ ఫ్యాన్ వేసుకున్నప్పటికీ ఉక్కపోత తీరదు. అలాంటప్పుడు ఫ్యాన్ గాలి ఎక్కువగా చల్లగా రావాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం...
సీలింగ్ ఫ్యాన్ రెక్కలపై ఎక్కువగా దుమ్ము పేరుకుంటూ ఉంటుంది. దీనివల్ల రెక్కల బరువు పెరిగి మోటార్‌పై ఒత్తిడి పడుతుంది. దీంతో ఫ్యాన్ తిరిగే వేగం మందగించి గాలి సరిగా రాదు. కాబట్టి వారానికోసారి ఫ్యాన్‌ను పొడిగుడ్డతో తుడిచి శుభ్రం చేస్తుంటే గాలి ఎక్కువగా వస్తుంది.
సీలింగ్ ఫ్యాన్ రెక్కలు నిర్దిష్ట కోణంలో ఉంటేనే కిందికి గాలి వీస్తుంది. ఈ వంపు మారితే గాలి సరిగా రాదు. కాబట్టి ఫ్యాన్ రెక్కలు సరైన అలైన్‌మెంట్‌లో ఉండాలి.
ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతుంటే వెంటనే కండెన్సర్‌ను పరిశీలించాలి. అవసరం మేరకు కొత్తదాన్ని అమరిస్తే ఫ్యాన్ గాలి ఎక్కువగా వస్తుంది.
గదిలో గాలి ప్రసరణ ఉండాలి. అలా లేని పక్షంలో గదిలో ఉన్న వేడిగాలినే ఫ్యాన్ అటూ ఇటూ తిప్పుతూ ఉంటుంది. బయటి గాలి లోపలికి వస్తూ లోపలి గాలి బయటికి వెళ్లేలా గది కిటికీలను తెరచి ఉంచాలి. ఆప్పుడే క్రాస్ వెంటిలేషన్ ఏర్పడి గది ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గుతుంది. దీంతో ఫ్యాన్ గాలి కూడా వేడిగా రాదు.
ఇవీ చదవండి:
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు