రోజూ జీడిపప్పు తిందాం..!
ABN , Publish Date - Oct 22 , 2026 | 05:33 AM
విటమిన్లు, ఖనిజాలతో నిండిన జీడిపప్పును రోజూ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...
విటమిన్లు, ఖనిజాలతో నిండిన జీడిపప్పును రోజూ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...
జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ట్రై గ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయి అమాంతం పెరగకుండా నియంత్రణలో ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి ప్రయోజనాన్ని అందిస్తుంది
జీడిపప్పులో ప్రొటీన్లు, పీచు అధికం. రోజుకు ఏడెనిమిది పప్పులు తింటే చాలు చాలాసేపటి వరకు ఆకలి అనిపించదు. దీంతో అతిగా తినాలనే భావన తగ్గి శరీర బరువు అదుపులో ఉంటుంది.
తరచూ జీడిపప్పు తింటుంటే శరీరానికి కావాల్సిన ఇ విటమిన్, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. జ్ఞాపకశక్తిని, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.
జీడిపప్పులో బి, కె విటమిన్లతోపాటు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తాయి. ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని నివారిస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..
భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి