మందులతో మగపిల్లలు పుట్టరు
ABN , Publish Date - Jun 25 , 2026 | 01:59 AM
డాక్టర్ మాకు ఇద్దరు ఆడపిల్లలు, మగపిల్లాడి కోసం ప్రయత్నించాలని అనుకుంటున్నాం. ఈ విషయం కొందరు వైద్యులకు చెప్పినప్పుడు, ప్రత్యేకించి మగపిల్లాడిని కనడానికి మందులు...
కౌన్సెలింగ్
డాక్టర్ మాకు ఇద్దరు ఆడపిల్లలు, మగపిల్లాడి కోసం ప్రయత్నించాలని అనుకుంటున్నాం. ఈ విషయం కొందరు వైద్యులకు చెప్పినప్పుడు, ప్రత్యేకించి మగపిల్లాడిని కనడానికి మందులున్నాయని అంటున్నారు. అవి వాడితే తప్పకుండా మగపిల్లాడు పుడతాడని భరోసా ఇస్తున్నారు. ఈ మందులు వాడుకోమంటారా?
ఓ సోదరి, హైదరాబాద్
గర్భం దాల్చడం దంపతుల పని. కానీ ఆడబిడ్డను కనాలా, మగబిడ్డను కనాలా అన్నది ఎవరి చేతుల్లోనూ ఉండదు. మరీ ముఖ్యంగా ‘వై’ క్రోమోజోములను పెంచి మగబిడ్డనే కనేలా చేసే వెసులుబాట్లు ఏమాత్రం ఉండవు. ఎవరైనా మీతో ఇలా నమ్మబలికితే ఆ మాటలు నమ్మవద్దు. మీ బలహీనతను ఆసరాగా తీసుకుని మోసం చేస్తున్నట్టు భావించండి. ఆ మందులు వాడుతున్న విషయాన్ని రహస్యంగా ఉంచమని ఆ వైద్యులు చెప్పడం వెనకున్న కారణం కూడా ఇదే! కొందరు నకిలీ వైద్యులు ఖరీదైన మందులతో మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు సర్వత్రా నమోదవుతున్నాయి. కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించండి. ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మగబిడ్డ కోసం ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ మందులను విశ్వసించి, మోసపోకండి. ఏ మందులూ వాడకుండా ప్రయత్నించి చూడండి. మగపిల్లాడు పుట్టినా, ఆడపిల్ల పుట్టినా ఒకేలా ఆదరించండి.
డాక్టర్ రాహుల్‌రెడ్డి,
ఆండ్రాలజిస్ట్,
ఆండ్రోకేర్, హైదరాబాద్
ఇవి కూడా చదవండి
సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!
టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!