Share News

మొక్కలకు బోన్‌ మీల్‌

ABN , Publish Date - Jun 24 , 2026 | 06:15 AM

మిద్దె తోట, ఇండోర్‌ ప్లాంట్స్‌, బాల్కనీ మొక్కలు, ఇంటి చుట్టూ ఉన్న మొక్కలకు బోన్‌మీల్‌ను అందించడం వల్ల కలిగే ప్రయోజనా లేంటో చూద్దాం...

మొక్కలకు బోన్‌ మీల్‌

మిద్దె తోట, ఇండోర్‌ ప్లాంట్స్‌, బాల్కనీ మొక్కలు, ఇంటి చుట్టూ ఉన్న మొక్కలకు బోన్‌మీల్‌ను అందించడం వల్ల కలిగే ప్రయోజనా లేంటో చూద్దాం...

  • మట్టిలో ఫాస్పరస్‌, కాల్షియం నిల్వలు పెరుగుతాయి. వీటిని తగుపాళ్లలో నెమ్మదిగా స్వీకరిస్తూ మొక్కలు ఆరోగ్యంగా తయారవుతాయి.

  • కొత్త మొక్కలు నాటేటప్పుడు లేదా విత్తనాలు చల్లేటప్పుడు మట్టిలో కొద్దిగా బోన్‌ మీల్‌ను కలిపితే వేర్లు బలంగా నాటుకుంటాయి.

  • పూత ఎక్కువగా వచ్చేటప్పుడు మొగ్గలు తొడిగేటప్పుడు మొక్కలకు బోన్‌మీల్‌ను అందించడం వల్ల దిగుబడి పెరుగుతుంది. టమాట, మిర్చి, రకరకాల పూల మొక్కలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

  • బంగాళదుంప, కేరట్‌, బీట్‌రూట్‌ లాంటి దుంప జాతి మొక్కలకు బోన్‌మీల్‌ను అందిస్తే ఆశించినదానికంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

  • బోన్‌మీల్‌... మట్టిలో చాలా నెమ్మదిగా కరుగుతుంది. కాబట్టి వర్షాకాలం ప్రారంభంలో మొక్కలకు ఒకసారి అందించి ఆపైన నాలుగు నెలలకోసారి కొద్ది పరిమాణంలో తీసుకుని మట్టిలో కలిపితే చాలు.

  • మొక్కల చుట్టూ ఉన్న మట్టిని కొద్దిగా త్రవ్వి బోన్‌మీల్‌ను చల్లి ఆపైన మట్టితో కప్పేసి నీటిని చిలకరిస్తే సరిపోతుంది.

  • ఆమ్లత్వం ఎక్కువగా ఉన్న మట్టిలో బోన్‌మీల్‌ను కలిపితే తక్షణ ఫలితాన్ని చూడవచ్చు. కుండీ మొక్కలకు చెంచా చొప్పున, మడిలో ఉండే మొక్కలకైతే చదరపు అడుగుకి 45 గ్రాముల బోన్‌మీల్‌ను కలపాలి.

  • బోన్‌మీల్‌లో సహజంగానే నత్రజని తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇతర సేంద్రీయ ఎరువులతో కలిపి వాడడం ప్రయోజనకరం.

ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి

Updated Date - Jun 24 , 2026 | 06:15 AM