Share News

పిల్లలు బిజీగా..!

ABN , Publish Date - Feb 25 , 2026 | 05:34 AM

వీకెండ్‌ సెలవులు వచ్చాయంటే చాలు పిల్లలు చేసే అల్లరితో తల్లిదండ్రులకు తలనొప్పి తప్పదు. అలాంటప్పుడు పిల్లల దృష్టిని మరల్చి వారిని...

పిల్లలు బిజీగా..!

వీకెండ్‌ సెలవులు వచ్చాయంటే చాలు పిల్లలు చేసే అల్లరితో తల్లిదండ్రులకు తలనొప్పి తప్పదు. అలాంటప్పుడు పిల్లల దృష్టిని మరల్చి వారిని బిజీగా ఉంచే ఏర్పాటు చేస్తే సరి. అదెలాగంటే...

  • కలరింగ్‌: పిల్లలకు డ్రాయింగ్‌ బుక్స్‌, కలర్‌ పెన్సిల్స్‌, క్రేయాన్స్‌, స్కెచ్‌ పెన్స్‌ లాంటివి ఇచ్చి బొమ్మలకు రంగులు వేయమని చెప్పాలి. ఇది పిల్లలు బాగా ఇష్టపడే అంశం కూడా. దీనివల్ల పిల్లల్లో ఏకాగ్రత, సృజనాత్మకత పెరుగుతాయి.

  • కథలు: బొమ్మల కథలు పిల్లలకు బాగా నచ్చుతాయి. అలాంటి కథల పుస్తకాలు తెచ్చి పిల్లలతో కలిసి కూర్చుని చదవాలి. కొద్దిసేపటి తరువాత వారే స్వయంగా చదవడానికి ఆసక్తి చూపిస్తారు. దీనివల్ల పిల్లల్లో ఊహా శక్తి పెరుగుతుంది.

  • బ్లాక్స్‌: రంరంగుల బిల్డింగ్‌ బ్లాక్స్‌ తెచ్చి వాటితో ఇల్లు, గుడి, బడి లాంటివి కట్టడం ఎలాగో చూపిస్తే చాలు. రోజంతా అదే పనిలో ఉంటారు పిల్లలు. పజిల్‌ గేమ్స్‌ ఆడించినా పిల్లల మేథాశక్తి మెరుగుపడుతుంది.

  • బొమ్మల తయారీ: బంకమట్టి లేదంటే క్రాఫ్ట్‌ క్లేతో రకరకాల బొమ్మలు తయారుచేయడం, వాటికి రంగులు వేయడం నేర్పిస్తే పిల్లలు ఇష్టంగా నేర్చుకుంటారు. వీటివల్ల పిల్లల మెదడు చురుకుగా మారుతుంది. కండరాలు బలోపేతమవుతాయి.

  • తోటపని: మొక్కలకు నీళ్లు పోయడం, ఎండిన ఆకులతోపాటు కొమ్మలను తొలగించడం, కుండీల్లో మట్టిని మార్చడం లాంటి చిన్న చిన్న పనులను పిల్లలచేత చేయించవచ్చు.

  • కళలు: పాటలు పాడడం, డ్యాన్స్‌ చేయడం, ఏదైన మ్యూజికల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (వీణ, కీ బోర్డ్‌, వయొలిన్‌ లాంటివి) ప్లే చేయడం లాంటివి నేర్చుకునే అవకాశం కల్పించినా ప్రయోజనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి..

మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

కొత్త పార్టీని ప్రకటించిన శశికళ

Updated Date - Feb 25 , 2026 | 05:34 AM