పిల్లలు బలహీనంగా ఉన్నారా..?
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:52 AM
పిల్లలు నీరసంగా బలహీనంగా కనిపిస్తుంటే వారికి ఎలాంటి ఆహారం తినిపించాలో తెలుసుకుందాం...
పేరెంటింగ్
పిల్లలు నీరసంగా బలహీనంగా కనిపిస్తుంటే వారికి ఎలాంటి ఆహారం తినిపించాలో తెలుసుకుందాం...
పిల్లలకు రోజూ ఒక అరటిపండును తినిపించాలి. దీనిలోని ఎ, బి, సి విటమిన్లు; మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ కలిసి తక్షణ శక్తిని అందిస్తాయి. రాత్రిపూట గాఢంగా నిద్ర పట్టేలా చేస్తాయి. దీంతో పిల్లల్లో చురుకుదనం పెరుగుతుంది
రోజూ భోజనంలో నెయ్యిని చేరిస్తే శరీరానికి కావాల్సిన మంచి కొవ్వులు లభిస్తాయి. సరైన పోషణ అంది పిల్లలు బరువు పెరుగుతారు. అలాగే రాత్రి పడుకునేముందు గ్లాసు పాలలో కొద్దిగా తేనె కలిపి తాగిస్తుంటే క్రమంగా నీరసం తగ్గి పిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటారు.
పెరుగు, జున్ను, చీజ్‌లను తినిపిస్తుంటే ఎ, బి, డి, ఇ విటమిన్లతోపాటు కాల్షియం, ప్రోటీన్లు అంది పిల్లలు బలంగా పెరుగుతారు.
ఉడికించిన కోడిగుడ్లు, మెంతికూర, పాలకూర, తాజా కూరగాయలు, పండ్లు, మొలకలు, పప్పు ధాన్యాలను ఆహారంలో చేరిస్తే ప్రోటీన్లు, పీచులు, ఇతర పోషకాలు అంది పిల్లల్లో నీరసం, బలహీనత తగ్గుతాయి.
సాల్మన్, ట్యూనా, సార్డిన్ లాంటి చేపలతో తయారుచేసిన వంటకాలు తినిపిస్తుంటే వాటిలోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్, కాల్షియం ప్రభావవంతంగా పనిచేసి పిల్లల్లో చురుకుదనాన్ని పెంచుతాయి.
పిల్లలకు బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు, ఖర్జూరం, కిస్‌మి్‌సలను తినిపిస్తుంటే వారిలో రక్తహీనత తగ్గుతుంది. కండరాలు వృద్ధి చెందుతాయి. ఎముకలు బలోపేతమవుతాయి. జీవక్రియలు వేగవంతమై పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజులో రూ.8.4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి
ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్..!