పేగులు ఇలా పదిలం
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:38 AM
మన పేగుల లోపల ప్రతి 3 నుంచి 5 రోజులకూ కొత్త పొర ఏర్పడుతూ ఉంటుంది. అందుకోసం తోడ్పడే పదార్థాల గురించి తెలుసుకుందాం!...
గట్ హెల్త్
మన పేగుల లోపల ప్రతి 3 నుంచి 5 రోజులకూ కొత్త పొర ఏర్పడుతూ ఉంటుంది. అందుకోసం తోడ్పడే పదార్థాల గురించి తెలుసుకుందాం!
రెడ్ క్యాబేజ్: ఎర్ర క్యాబేజీలో ఎల్ గ్లూటమిన్ అనే అమీనో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. పేగుల్లోని లోపలి పొర కణాలైన ఎంటెరోసైట్స్ ఉత్పత్తికి ఈ అమీనో యాసిడ్ ఇంధనంగా పని చేస్తుంది.
యాపిల్స్: యాపిల్స్‌ను ఉడికించడం వల ్ల పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ విడుదలవుతుంది. మ్యూకోసల్ బ్యారియర్ అనే రక్షిత స్లైమ్ పొర, వ్యాధికారక సూక్ష్మక్రిములు పేగు కణాలను నేరుగా తాకే వీల్లేకుండా, అడ్డుపడుతూ ఉంటుంది. ఈ పొర తయారీకి పెక్టిన్ అవసరం.
పసుపు: పేగుల గోడల్లోని ఇన్‌ఫ్లమేటరీ మార్గాలను అడ్డుకునే కుర్‌క్యుమిన్ అనే అణువు పసుపులో ఉంటుంది. ఆహారానికి పసుపును జోడించడం ద్వారా, ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచే సైటోకైన్స్ క్షీణించి, పేగుల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొని, రక్షిత పొర సజావుగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది
కెఫిర్: ఈ ప్రాచీన పులియబెట్టిన పానీయంలో ప్రత్యేకమైన ప్రొబయాటిక్స్ ఉంటాయి. ఈ మంచి బ్యాక్టీరియా పేగుల్లోని చెడు బ్యాక్టీరియా మీద పైచేయి సాధించి, పేగు కణాల మధ్య నెలకొని ఉండే బంధాలను మరింత బలపరిచే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్లను ఉత్పత్తి చేస్తాయి.
అల్లం: అజీర్తికి చక్కని విరుగుడుగా పని చేసే అల్లం, జీర్ణం కాని పదార్థాలు పేగుల్లో నిల్వ ఉండకుండా, బయటకు తోసేసి పేగుల లోపలి పొర దెబ్బతినకుండా కాపాడుతుంది
నానబెట్టిన అవిసె గింజలు: వీటితో తయారయ్యే జెల్‌ను పోలిన ద్రవం, ద్రవరూప బ్యాండేజీగా సహాయపడుతుంది.
ఈ వార్తలనూ చదవండి:
హెలికాప్టర్ మెషిన్‌గన్‌ను నేలపై కాల్చే ప్రయత్నం.. చివరికి ఏమైందంటే..
ఇరాన్ హిట్‌లిస్ట్‌లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ..