Share News

సప్లిమెంట్లతో ప్రమాదాలు

ABN , Publish Date - Mar 24 , 2026 | 02:25 AM

వ్యాదునుంచి, వృద్ధాప్య లక్షణాల నుంచి పురుషులకు రక్షణ కల్పించే, యాంటీఆక్సిడెంట్లు... ఎన్‌-ఎసిటైల్‌-ఎల్‌-క్రిస్టీన్‌, సెలీనియంలకు కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయనీ, కుటుంబ నియంత్రణ పాటించని...

సప్లిమెంట్లతో ప్రమాదాలు

పరిశోధన

వ్యాదునుంచి, వృద్ధాప్య లక్షణాల నుంచి పురుషులకు రక్షణ కల్పించే, యాంటీఆక్సిడెంట్లు... ఎన్‌-ఎసిటైల్‌-ఎల్‌-క్రిస్టీన్‌, సెలీనియంలకు కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయనీ, కుటుంబ నియంత్రణ పాటించని పురుషులు వీటిని వాడుకుంటూ పిల్లలను కన్నప్పుడు, ఆ పిల్లల్లో ఎదుగుదల లోపాలు తలెత్తుతాయనీ తాజా అధ్యయనంలో రుజువైంది.

టెక్సాస్‌ ఎ అండ్‌ ఎమ్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు, ఈ సప్లిమెంట్ల దుష్ప్రభావాల గురించి మగ చిట్టెలుకల మీద కొన్ని ప్రయోగాలు చేపట్టారు. వీటికి సదరు మందులను అధిక మోతాదుల్లో అందించినప్పుడు, వాటికి పుట్టిన సంతానం, పుట్టుకతోనే పుర్రె, ముఖ ఎముకల్లో లోపాలను వెంటబెట్టుకొచ్చింది. కొన్ని పిల్లలు సాధారణ పరిమాణం కంటే చిన్న పుర్రెలను కలిగి ఉండడం, కంటి నిర్మాణాల్లో లోపాలను కలిగి ఉండడం లాంటి అవలక్షణాలను పరిశోధకులు కనిపెట్టారు. ఈ అధ్యయ ునం ద్వారా కొన్ని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని వాయిదా వేయడానికి ఉపయోగపడుతున్నప్పటికీ, వాటిని అవసరానికి మించి వాడుకోవడం వల్ల వీర్యకణాల డిఎన్‌ఎలోని జీవసంబంధ సంతులనం దెబ్బతింటున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి..

క్షిపణిపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్‌ పైకి ప్రయోగించిన ఇరాన్..

మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ పులుల మధ్యనున్న జీబ్రాను 10 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 24 , 2026 | 02:26 AM