Share News

మొటిమలు వేధిస్తున్నాయా..?

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:23 AM

వాతావరణ కాలుష్యం, హార్మోన్లలో అసమతుల్యతల కారణంగా ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని నివారించేందుకు సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే...

మొటిమలు వేధిస్తున్నాయా..?

వాతావరణ కాలుష్యం, హార్మోన్లలో అసమతుల్యతల కారణంగా ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని నివారించేందుకు సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే నల్లని మచ్చలు ఏర్పడి ముఖసౌందర్యాన్ని పాడు చేస్తాయి. అలాకాకుండా కొన్ని ఇంటి చిట్కాలు పాటించి మొటిమలను నివారించుకోవచ్చు.

  • గుప్పెడు వేపాకులను మెత్తగా నూరి ఆ పేస్టులో రెండు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. రాత్రి పడుకునేముందు ఈ మిశ్రమాన్ని మొటిమల మీద చుక్కలా ఉంచి ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మూడు రోజుల్లో మొటిమలు తగ్గిపోతాయి.

  • చిన్న గిన్నెలో చెంచా పసుపు, తగినన్ని పాల చుక్కలు వేసి పేస్టులా కలపాలి. దీన్ని మొటిమలపైన పలుచని పూతలా రాయాలి. ఇది బాగా ఆరిన తరువాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నాలుగు రోజుల్లో మొటిమలు మాయమవుతాయి. పసుపులోని కర్కుమిన్‌ సమ్మేళనాలు మొటిమల వల్ల వచ్చే వాపు, మంటను తగ్గిస్తాయి.

  • రోజూ ఉదయాన్నే ముఖానికి టమాటా రసం అప్లయ్‌ చేయాలి. గంట తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే చర్మ రంధ్రాలు పూర్తిగా శుభ్రపడతాయి. ముఖంపై జిడ్డు ఏర్పడడం ఆగుతుంది. దీంతో మొటిమలు తగ్గుముఖం పడతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.

  • మొటిమలపైన కొద్దిగా కలబంద గుజ్జు లేదా తేనె రాసి అరగంటసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఆపైన మంచినీటితో ముఖం కడిగేసుకుంటే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.

  • కొంతమందికి మొటిమలు పెద్ద దద్దుర్ల మాదిరి వస్తుంటాయి. వీటిపైన ఐస్‌క్యూబ్స్‌తో సున్నితంగా రుద్దితే ఆ ప్రదేశంలో రక్తనాళాలు కుంచించుకుపోయి వాపు, నొప్పి తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి..

ఇరాన్ అణు కేంద్ర నగరంపై దాడులు.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ విమానాలు..

మీది డేగ చూపు అయితే.. ఇసుకలో దాక్కున్న పామును 5 సెకెన్లలో కనిపెట్టండి

Updated Date - Mar 16 , 2026 | 12:23 AM