‘హల్దీ’కి పూల ఆభరణాలు...
ABN , Publish Date - Aug 23 , 2026 | 02:32 AM
వివాహానికి ముందు రోజు జరిగే హల్దీ వేడుకలో వధువు పసుపు రంగు దుస్తులతోపాటు అందమైన పూల ఆభరణాలు ధరించడం నేటి ట్రెండ్. దానికి తగ్గట్టు విభిన్నమైన మెటీరియల్స్‌తో...
వివాహానికి ముందు రోజు జరిగే హల్దీ వేడుకలో వధువు పసుపు రంగు దుస్తులతోపాటు అందమైన పూల ఆభరణాలు ధరించడం నేటి ట్రెండ్. దానికి తగ్గట్టు విభిన్నమైన మెటీరియల్స్‌తో తాజా పూలను తలపించేలా ఫ్లవర్ జ్యువెలరీని తయారుచేస్తున్నారు డిజైనర్లు. ఈ సంబరంలో ప్రధానంగా నిర్వహించే మంగళస్నానమప్పుడు తడిసినా ఏమాత్రం చెదరని రీతిలో యాక్రిలిక్, రెసిన్, గవ్వలతో రూపొందించిన నగలకు డిమాండ్ అధికంగా ఉంటోంది. వీటికి బంగారు గుండ్లు, ముత్యాలు, జర్దోసి వర్క్‌లు, లేసులతో అదనపు హంగులద్ది మరింత ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు.
పసుపు, గులాబీ, తెలుపు రంగుల పూలతో పాటు ఆకుపచ్చని ఆకులు, తీగల నమూనాలు చేర్చి నగలను డిజైన్ చేస్తారు. పాపిడి బిళ్ల, ముక్కు పుడక, పెద్ద జుంకాలు, నెక్లెస్, పొడవాటి హారం, వడ్డాణం, అరవంకీలు, గాజులు, ఉంగరాలతోపాటు కాళ్ల పట్టీలను సైతం సిద్దం చేస్తున్నారు. హల్దీ రోజున పెళ్లికూతురు ధరించే సంప్రదాయ లెహంగా లేదా లంగా-ఓణీ మీద సూటయ్యేలా ఈ పూల ఆభరణాలు అందుబాటులో ఉంటున్నాయి.
సిల్క్ క్లాత్, గోటా పట్టీలతో పూలను డిజైన్ చేస్తారు. లోహపు రిబ్బన్లు, పట్టు దారాలు, ఆర్టిఫీషియల్ ఫ్లవర్స్, గోల్డ్ లేసులు, జర్దోసి వైర్లను కూడా విరివిగా ఉపయోగిస్తారు. స్పేసర్ బీడ్స్, బీడ్ క్యాప్స్, సెంటర్ పీసెస్, జంప్ రింగ్స్ లాంటి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ కాంపోనెంట్స్ వాడి ఈ పూల ఆభరణాలకు మరింత శోభను చేకూరుస్తారు.
పసుపు రంగు పూలు, ముత్యాలు, కుందనాలతో కూర్చిన డిజైన్లు గ్రాండ్ లుక్‌నిస్తాయి. ఇవి తేలికగా సౌకర్యవంతంగా అనిపిస్తాయి. ఫొటోలు, వీడియోల్లో కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. పాస్టెల్ పింక్, ఐవరీ, మింట్ గ్రీన్, లైట్ ఎల్లో ఫ్లవర్ జ్యువెలరీని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఫ్లవర్ హాత్‌ఫూల్‌కు కూడా డిమాండ్ అధికంగా ఉంటోంది. సన్నని ముత్యాల గొలుసులు వేలాడుతున్న రంగురంగుల పూల నెక్లెస్, మ్యాచింగ్ జుంకాలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. పసుపు రంగు సంప్రదాయ దుస్తులమీద తెల్లటి పూల ఆభరణాలను ధరిస్తే ఎలిగెంట్ లుక్ వస్తుంది. సింపుల్‌గా కనిపించాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. బంతి, మొగలి, మల్లె, గులాబీ, చేమంతి, జాజి, సంపెంగ పూల నమూనాలతో రూపొందించిన నెక్లెస్, ఆ పూల డ్రాప్స్‌తో కూడిన జుంకాలు, మ్యాచింగ్ పూలతో తయారుచేసిన బాజుబందులు, పూల దండతో కూర్చిన పాపిడి బిళ్ల ధరిస్తే సందర్భానికి తగ్గట్టు గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తారు.
ఇవి కూడా చదవండి
ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్