Share News

పూలమాలలు ఇలా...

ABN , Publish Date - Sep 14 , 2026 | 06:10 AM

గణపయ్యకు గన్నేరు, జిల్లేడు, మల్లె, ఎర్ర మందారం, శంకు, పారిజాతం, చంప, చామంతి పూలు ప్రీతికరం. వీటితో సులువుగా పూలమాలలు ఎలా తయారుచేయాలో చూద్దాం...

పూలమాలలు ఇలా...

గణపయ్యకు గన్నేరు, జిల్లేడు, మల్లె, ఎర్ర మందారం, శంకు, పారిజాతం, చంప, చామంతి పూలు ప్రీతికరం. వీటితో సులువుగా పూలమాలలు ఎలా తయారుచేయాలో చూద్దాం...

  • ముందుగా బలమైన కాటన్‌ దారం, సూది, కత్తెరలను దగ్గర పెట్టుకోవాలి.

  • తాజా పూలను తెచ్చుకోవాలి. రేకులు, కాడలు బలంగా ఉండే వాటిని ఎంచుకోవాలి. వాడినవాటిని ముందుగానే తీసివేయాలి.

  • పొడవాటి దారాన్ని తీసుకుని మొదటి పువ్వును స్థిరంగా ఉంచేందుకు గట్టి ఉచ్చును కట్టాలి. మరో పువ్వు కాండాన్ని ప్రధాన దారం మీద ఆనించి కొంత దారాన్ని వేళ్ల చుట్టూ రింగులా చుట్టి దాన్ని పువ్వు మొదలు మీదికి జారవిడిచి దారాన్ని గట్టిగా లాగాలి. ఇలా లూప్‌ పద్ధతిలో ఎంత పెద్ద పూలమాలనైనా తయారుచేయవచ్చు. అలాగే మధ్య మధ్యలో మరువం, ఽమాచిపత్రి రెమ్మలను చేర్చి మాల కట్టవచ్చు.

  • సూదికి పొడవాటి దారాన్ని ఎక్కించాలి. ఒక్కో పువ్వును సూదికి గుచ్చి దారం చివర వరకు తేవాలి. ఇలా పూలన్నింటి ఓ క్రమంలో గుచ్చుతూ రావాలి. దారానికి పూల కాండాన్ని లేదంటే పుష్పాధారం గుండా గుచ్చవచ్చు. ఇలా కావాల్సినంత పొడవు వరకు తయారుచేసుకుని చివరగా సూదిని తీసివేసి దారం కొనలను ముడివేస్తే పూలమాల సిద్ధమవుతుంది. అక్కడక్కడ రంగురంగుల పూలు లేదా పూసలను గుచ్చితే చూడడానికి బాగుంటుంది.

  • బంతి, చామంతి లాంటి బరువైన పూలను కాస్త పెద్ద సూదితో లావాటి దారానికి గుచ్చితే మాల నిటారుగా వస్తుంది. అప్పుడు గుమ్మాన్ని పాలవెల్లిని అలంకరించడానికి బాగుంటుంది. మధ్య మధ్యలో మామిడి ఆకులను మడిచి గుచ్చితే దండ అందంగా కనిపిస్తుంది.

ఈ వార్తలనూ చదవండి:

బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు

ఈఎంపీ షీల్డులు, హైటెక్ ఎన్‌క్రిప్షన్.. మిసైల్ దాడులనూ తిప్పికొట్టే జిన్ పింగ్ ఫ్లైట్.!

Updated Date - Sep 14 , 2026 | 06:10 AM