ఫ్యాషన్ యోగా పసందుగా
ABN , Publish Date - Mar 11 , 2026 | 03:09 AM
సౌకర్యవంతమైన యోగా సాధన కోసం ప్రత్యేకమైన యోగా ప్యాంట్స్, డ్రస్సులు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఆకర్షణీయమైన ఆ దుస్తుల మీద ఓ...
సౌకర్యవంతమైన యోగా సాధన కోసం ప్రత్యేకమైన యోగా ప్యాంట్స్, డ్రస్సులు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఆకర్షణీయమైన ఆ దుస్తుల మీద ఓ లుక్కేద్దామా?
ఎంపిక ఇలా: సౌకర్యవంతంగా ఉండే ప్యాంటును ఎంచుకోవాలి. కటి ప్రదేశంలో అదనపు ఫ్యాబ్రిక్ ప్యాచ్ వర్క్ ఉండేలా చూసుకోవాలి. యోగా సాధన ఆధారంగా ప్యాంటు పొడవును ఎంచుకోవాలి.
పలు రకాలు: బ్యూటీ షార్ట్స్, వైడ్ లెగ్ ప్యాంట్స్, యోగా స్వెట్ ప్యాంట్స్, క్రాప్‌డ్ లెగ్గింగ్స్, యాంకిల్ లెంగ్త్ రన్నింగ్ ప్యాంట్స్... ఇలా యోగా కోసం ఎంచుకోవడానికి లెక్కలేనన్ని రకాల యోగా ప్యాంట్లు దొరుకుతున్నాయి. వీటిలో నప్పే దాన్ని ఎంచుకోవాలి.
ఫ్యాబ్రిక్: యోగా ప్యాంట్లు నైలాన్, పాలిస్టర్, కాటన్ బ్లెండ్, లైక్రా, ఊల్ లేదా ఇతరత్రా సాగే గుణం కలిగిన మెటీరియల్‌తో తయారవుతూ ఉంటాయి. వీటిలో సౌకర్యానికీ, మన్నికకూ పెద్ద పీట వేయాలి. అలాగే కొన్ని ఫ్యాబ్రిక్స్ చర్మపు అలర్జీలకు కారణమవుతాయి. కాబట్టి మృదువుగా ఉండే ఫ్యాబ్రిక్‌తో తయారైన యోగా ప్యాంటునే ఎంచుకోవాలి.
నప్పే టాప్: ప్యాంట్‌తో టాప్ మ్యాచ్ అయ్యేలా ఉండడం కోసం స్పోర్ట్స్ టీషర్ట్స్ లేదా స్పోర్ట్స్ బ్రాసరీలను ఎంచుకోవచ్చు. టాప్ ఎబ్బెట్టుగా, మరీ బిగుతుగా లేదా మరీ వదులుగా ఉండకుండా, యోగాసనాలకు అనువుగా ఉండేలా చూసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా ఉంటుంది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
డ్రోన్ల తయారీ వ్యాపారంలో ట్రంప్ తనయుల పెట్టుబడులు