Share News

డైనింగ్‌ టేబుల్‌ వద్ద నో గాడ్జెట్‌ రూల్‌

ABN , Publish Date - Feb 11 , 2026 | 01:44 AM

భోజనం చేసేటప్పుడు ఫోన్లు, టీవీలు చూడటం వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనిని అరికట్టేందుకు ఇలా...

డైనింగ్‌ టేబుల్‌ వద్ద నో గాడ్జెట్‌ రూల్‌

భోజనం చేసేటప్పుడు ఫోన్లు, టీవీలు చూడటం వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనిని అరికట్టేందుకు ఇలా చేయండి.

  • మైండ్‌ఫుల్‌ ఈటింగ్‌: ఆహారం రంగు, రుచి, వాసనను ఆస్వాదిస్తూ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గాడ్జెట్స్‌ చూస్తూ తింటే పిల్లలు అతిగా తినడం లేదా అసలు తినకపోవడం జరుగుతాయి.

  • సంభాషణలకు ప్రాధాన్యం: భోజన సమయాన్ని కుటుంబ సభ్యుల మధ్య కబుర్ల సమయంగా మార్చండి. ఆ రోజంతా ఎవరెవరు ఏం చేశారో పంచుకోవడం వల్ల పిల్లల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెరుగుతాయి.

  • తల్లిదండ్రులే రోల్‌ మోడల్స్‌: పిల్లలకు వద్దని చెప్పేముందు, భోజనం చేసేటప్పుడు తల్లిదండ్రులు కూడా ఫోన్లను పక్కనపెట్టడం అత్యంత ముఖ్యం.

ఈ వార్తలు కూడా చదవండి..

పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు.. కేసు నమోదు

మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..

For More AP News And Telugu News

Updated Date - Feb 11 , 2026 | 01:45 AM