Share News

ముఖాన్ని అలంకరించే... ఫేస్‌లెట్‌

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:33 AM

ఆభరణాలతో చెవులనూ, ముక్కునూ అలంకరించుకుంటున్నప్పుడు, ముఖాన్నెందుకు అలంకరించుకోకూడదు? ఈ ఆలోచనతో మొదలైన తాజా ఫ్యాషన్‌...

ముఖాన్ని అలంకరించే... ఫేస్‌లెట్‌

ఫ్యాషన్‌

ఆభరణాలతో చెవులనూ, ముక్కునూ అలంకరించుకుంటున్నప్పుడు, ముఖాన్నెందుకు అలంకరించుకోకూడదు? ఈ ఆలోచనతో మొదలైన తాజా ఫ్యాషన్‌ ట్రెండ్‌... ‘ఫేస్‌లెట్‌’! దీని గురించి తెలుసుకుందాం!

కళ్లు, బుగ్గలు, కణతలను అలంకరించేలా రూపొందిన ఆభరణాలే ఫేస్‌లెట్స్‌. సంప్రదాయ ఆభరణాలకు భిన్నంగా, కళ్లజోడును తలపించే ఈ ఆభరణాలు ముఖం అందాన్ని పెంచుతాయి. స్టైలి్‌షగా, వినూత్నంగా కనిపించే ఫేస్‌లెట్స్‌, భిన్నమైన సందర్భాల్లో, భిన్నమైన వస్త్రధారణలకు సూటయ్యే డిజైన్లలో రూపొందుతూ ఉంటాయి. చీక్‌బోన్‌ డ్రాప్స్‌, టెంపుల్‌ యాక్సెంట్స్‌, ఫైన్‌ చైన్స్‌... ఇలా పలు రకాల మోడళ్లు కూడా ఉంటాయి. బంగారంతో పాటు సిల్వర్‌ ప్లేటెడ్‌, ఇతరత్రా మెటల్‌ ఫిని్‌షలతో రూపొందే ఫేస్‌లెట్స్‌, క్రిస్టల్స్‌, రంగు రాళ్లు, డెకరేటివ్‌ ఛార్మ్స్‌ను కూడా కలిగి ఉంటాయి.

చారిత్రక మూలాలు

2026 ట్రెండియస్ట్‌ జ్యువెలరీగా పేరు తెచ్చుకున్న ఫేస్‌లెట్స్‌, ప్రత్యేకించి యువతరం లక్ష్యంగానే రూపొందుతున్నాయి. సరికొత్తగా, సంప్రదాయేతరంగా కనిపించే ఫేస్‌లెట్స్‌, పలు వేడుకల్లో ధరించడానికి అనువైనవి. ఈవినింగ్‌ గౌన్స్‌ కోసం, ఆర్నేట్‌ ఫిలిగ్రీ, క్రిస్టల్స్‌తో కూడిన ఫేస్‌లెట్స్‌ను ఎంచుకోవాలి. పూసలు, ఈకలతో అలంకరించిన ఫేస్‌లెట్స్‌, మ్యూజిక్‌ వేడుకల్లో ధరించడానికి అనువుగా ఉంటాయి. ఈ ఆభరణాలకు లోతైన మూలాలు లేకపోలేదు. ఆఫ్రికా, ఈశాన్య ఆఫ్రికాల్లో ముఖ పూసలు, లోహపు ఆర్నమెంట్స్‌, సంప్రదాయాలు, దైనందిన అలంకరణల్లో భాగాలు. ఇప్పుడీ ట్రెండ్‌ ఫేస్‌లెట్‌ రూపంలో యువతరం మనసును గెలుచుకుంటోంది.

వధువు అలంకరణలో...

ఉప సంప్రదాయ అలంకరణను ఇష్టపడే వధువులు, ఫేస్‌లెట్స్‌ను ఎంచుకుంటున్నారు. ఫేస్‌లెట్స్‌, సంప్రదాయ ఆభరణాలతో ఎంతో బాగా జోడీ కడతాయి కాబట్టి ఆధునిక వధువులు పెళ్లి అలంకరణల్లో వీటికి పెద్ద పీట వేస్తున్నారు. జెంటిల్‌ డాంగ్లింగ్‌, లైట్‌ ఛార్మ్స్‌, సింగిల్‌ డైమండ్‌ డిజైన్ల ఫేస్‌లెట్స్‌ ప్రత్యేకించి వధువుల కోసమే రూపొందుతున్నాయి. ప్రముఖ పాప్‌సింగర్‌ బియోన్సె, దక్షిణ కొరియా గాయని, జాన్‌ సోమి, కెపాప్‌ సెలబ్రిటీలు ఫేస్‌లెట్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టారు.

ఇవి కూడా చదవండి..

ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్

బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత

Updated Date - Apr 01 , 2026 | 01:33 AM