Share News

Life Skills For Children: పిల్లలకు ఇవి నేర్పించాలి

ABN , Publish Date - Jan 05 , 2026 | 01:33 AM

పిల్లలు సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. అందుకోసం పిల్లలకు చిన్నప్పటి నుంచి ఏ అంశాలు నేర్పించాలో తెలుసుకుందాం...

Life Skills For Children: పిల్లలకు ఇవి నేర్పించాలి

పిల్లలు సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. అందుకోసం పిల్లలకు చిన్నప్పటి నుంచి ఏ అంశాలు నేర్పించాలో తెలుసుకుందాం...

  • రోజూ ఉదయాన్నే నిద్ర లేవడం, వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, సమయానుసారం నిద్రించడం అలవాటు చేయాలి.

  • శ్రద్దగా పాఠాలు చదవడంతోపాటు ఆటలు ఆడడం, పుస్తక పఠనం, ఆసక్తి ఉన్న కళలను నేర్చుకోవడం లాంటి వాటి ఆవశ్యకతను తెలియజెప్పాలి. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించాలి.

  • కుటుంబ సభ్యులతోపాటు బంధుమిత్రులు, పెద్దలు, తోటివారితో గౌరవంగా ఎలా మెలగాలో తెలియజేయాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, సౌమ్యంగా మాట్లాడడం నేర్పించాలి.

  • గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడినప్పుడు కుంగిపోవడం కాకుండా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం నేర్పించాలి. సవాళ్లను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో వివరించాలి.

  • నిజాయితీగా మెలగడంతోపాటు కష్టపడే మనస్తత్వాన్ని అలవాటు చేయాలి. డబ్బు విలువను తెలియజెప్పాలి. డబ్బును పొదుపు చేయడం, ఖర్చు చేయడం లాంటి ఆర్థిక నిర్వహణ పాఠాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.

  • పిల్లల్లో స్నేహభావాన్ని పెంచుతూ పరస్పర సహకారంతో మెలగడం నేర్పించాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అలవాటు చేయాలి.

  • ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం, భావ వ్యక్తీకరణ, చిన్న చిన్న బాధ్యతలను నిర్వర్తించడం లాంటి వాటిని విధిగా నేర్పించాలి.

ఇవీ చదవండి:

క్వారీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా? ఈ సంకేతం వస్తే జాగ్రత్త సుమీ.!

Updated Date - Jan 05 , 2026 | 01:33 AM