బరువు తగ్గేందుకు...
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:27 AM
ఆరోగ్యకరమెన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్రలతో శరీర బరువును నియంత్రించుకోవచ్చు. ఎలాగంటే...
ఆరోగ్యకరమెన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మంచి నిద్రలతో శరీర బరువును నియంత్రించుకోవచ్చు. ఎలాగంటే...
ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల నిమ్మరసం, చిటికెడు ఉప్పు వేసుకుని తాగాలి. దీనివల్ల శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వులు కరిగిపోతాయి. అల్పాహారం మానకూడదు. కార్బోహైడ్రేట్లు తక్కువగా ప్రొటీన్లు, పీచులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రోజూ ఆహారంలో ఓట్స్, క్వినోవా, ఉడికించిన కూరగాయలు, ఆకు కూరలు, పెరుగు, పనీర్, గుడ్లు, మొలకలు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లు ఉండేలా చూసుకోవాలి. నూనె పదార్థాలు, స్వీట్లు, జంక్ ఫుడ్‌ను తినకూడదు. నీరు ఎక్కువగా తాగాలి. రాత్రి భోజనాన్ని త్వరగా ముగించాలి. పడుకునేముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగితే ఉదయానికల్లా శరీరంలోని వ్యర్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయి.
రోజూ కనీసం అరగంటసేపు వ్యాయామం చేయాలి. వాకింగ్, జాగింగ్, స్కిప్పింగ్, ఏరోబిక్ వ్యాయామాలు మంచి ఫలితాన్నిస్తాయి. వారానికి రెండుసార్లు స్క్వాట్స్ లాంటి కఠినమైన వ్యాయామాలు చేయాలి. మెట్లు ఎక్కడం దిగడం వల్ల ఎక్కువగా శక్తి వినియోగమవుతుంది.
రోజుకు కనీసం ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోవాలి. దీనివల్ల హార్మోన్లు సమతుల్యంగా పనిచేస్తాయి. జీవక్రియలు వేగవంతమై శరీర బరువు అదుపులోకి వస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా
ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..