Share News

Home Remedies For White Teeth: దంతాల పసుపుదనం పోయేదెలా

ABN , Publish Date - Jan 05 , 2026 | 01:36 AM

కొంతమందికి దంతాలు పసుపు రంగులోకి మారుతుంటాయి. వాటిని తెల్లగా మార్చే చిట్కాలివే...

Home Remedies For White Teeth: దంతాల పసుపుదనం పోయేదెలా

కొంతమందికి దంతాలు పసుపు రంగులోకి మారుతుంటాయి. వాటిని తెల్లగా మార్చే చిట్కాలివే...

  • ఒక పళ్లెంలో రెండు చెంచాల బేకింగ్‌ సోడా వేసి కొన్ని నీళ్లు చిలకరించి పేస్టులా చేయాలి. దీంతో దంతాలను సున్నితంగా తోమాలి. ఆపైన గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే దంతాల పసుపుదనం తొలగిపోతుంది.

  • బాగా పండిన స్ట్రాబెర్రీ పండ్లు నాలుగింటిని గిన్నెలోకి తీసుకుని చెంచాతో మెదిపి గుజ్జులా చేయాలి. దీంతో తోముకుంటే గార, పసుపుదనం తొలగి దంతాలు తెల్లగా మెరుస్తాయి. స్ట్రాబెర్రీలో ఉండే మాలిక్‌ యాసిడ్‌ మంచి బ్లీచింగ్‌ ఏజెంట్‌లా పనిచేస్తుంది.

  • ఒక గిన్నెలో రెండు చెంచాల యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, రెండు చెంచాల నీళ్లు తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమంలో టూత్‌బ్రష్‌ను ముంచి దానితో దంతాలు తోముకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

  • నారింజ తొక్కలు లేదంటే అరటిపండు తొక్కలను చిన్న ముక్కలుగా చేసి బాగా ఎండబెట్టి మెత్తటి పొడిలా చేయాలి. దీంతో తోముకున్నా దంతాలు తెల్లగా మారతాయి.

  • రెండు రోజులకోసారి మూడు చెంచాల కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని కనీసం పది సెకన్లపాటు పుక్కిలిస్తే ప్రయోజనం ఉంటుంది.

  • తరచూ జామ, యాపిల్‌, క్యారెట్‌, స్ట్రాబెర్రీలను తింటూ ఉంటే దంతాలు పసుపు రంగులోకి మారవు.

  • కాఫీ, టీలను ఎక్కువగా తాగకూడదు. మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉంటే దంతాలు ఎప్పుడూ తెల్లగా మెరుస్తుంటాయి.

ఇవీ చదవండి:

క్వారీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

ఎలక్ట్రిక్ గీజర్ వాడుతున్నారా? ఈ సంకేతం వస్తే జాగ్రత్త సుమీ.!

Updated Date - Jan 05 , 2026 | 01:36 AM