స్లైడింగ్ ట్రాక్‌లు ఇలా శుభ్రం
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:08 AM
వార్డ్ రోబ్‌లు, కిటికీలు, బాల్కనీలు, గది లేదా ఆఫీస్ డివైడర్లు, భద్రత షర్టర్లు, గిడ్డంగులు, కర్మాగారాల తలుపులు...
వార్డ్ రోబ్‌లు, కిటికీలు, బాల్కనీలు, గది లేదా ఆఫీస్ డివైడర్లు, భద్రత షర్టర్లు, గిడ్డంగులు, కర్మాగారాల తలుపులు తెరవడానికి మూయడానికి ఉపయోగించే స్లైడింగ్ ట్రాక్‌లలో తరచూ దుమ్ము, మురికి చేరుతూ ఉంటాయి. వీటిని సులువుగా శుభ్రం చేసే చిట్కాలు...
వ్యాక్యూమ్ క్లీనర్‌కు సన్నని నాజిల్‌ను అమర్చి దానితో స్లైడింగ్ ట్రాక్‌లో ఉండే దుమ్ము, ధూళిని సులభంగా వ్యాక్యూమ్ చేయవచ్చు.
ట్రాక్‌లో బేకింగ్ సోడా చల్లి దానిపైన కొద్దిగా వెనిగర్‌ను చిలకరిస్తే నురుగు ఏర్పడుతుంది. ఇది మెల్లగా మురికిని కరిగిస్తుంది. పది నిముషాల తరువాత పాత గుడ్డ లేదా బ్రష్‌తో తుడిచేస్తే ట్రాక్ శుభ్రమవుతుంది.
సబ్బు నీళ్లలో ముంచిన స్పాంజ్‌ను ట్రాక్‌పై ఉంచి నొక్కుతూ గట్టిగా తుడవాలి. పెన్ లేదా కర్ర సహాయంతో స్పాంజ్‌ను లోపలికి నెట్టి ముందుకు జరుపుతూ తుడిస్తే ట్రాక్‌లో పేరుకున్న మురికి తొలగిపోతుంది. లేదంటే స్పాంజ్ మధ్యలో ట్రాక్ ఆకారంలో పొడవుగా కత్తిరింపులు చేసి వాటి సహాయంతో అన్ని వరుసలను ఒకేసారి శుభ్రం చేయవచ్చు.
చిన్న సైజు పెయింటింగ్ బ్రష్‌తో ట్రాక్‌లో చేరిన దుమ్మును దులపవచ్చు. తరువాత తడిగుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది.
హెయిర్ డ్రైయర్ సహాయంతో ట్రాక్‌లోని దుమ్మును ఒక మూలకు చేర్చాలి. తరువాత తడి గుడ్డతో దాన్ని తీసివేయాలి.
అర గ్లాసు నీళ్లలో రెండు చుక్కల డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి బాగా కలపాలి. ఈ నీళ్లను స్ర్పే బాటిల్‌లో పోసి స్లైడింగ్ ట్రాక్ లోపల స్ర్పే చేయాలి. పది నిమిషాల తరువాత టిష్యూ పేపర్‌తో తుడిచేస్తే ట్రాక్ క్లీన్‌గా మారుతుంది.
ఇవీ చదవండి
మాకూ హెల్ప్ చేయండి! సుందర్ పిచాయ్‌కు భారతీయ విద్యార్థుల రిక్వెస్ట్
బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ