Share News

బరువు తగ్గాలా..!

ABN , Publish Date - Jan 29 , 2026 | 03:12 AM

కొత్త సంవత్సర వేడుకలు, సెలవుల్లో రకరకాల వంటకాలు, స్వీట్లు లాగించేసి ఉంటారు. దీనివల్ల బరువు పెరిగి...

బరువు తగ్గాలా..!

కొత్త సంవత్సర వేడుకలు, సెలవుల్లో రకరకాల వంటకాలు, స్వీట్లు లాగించేసి ఉంటారు. దీనివల్ల బరువు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే కఠినమైన డైటింగ్‌లు, ఖరీదైన సప్లిమెంట్లు అక్కర్లేదు. మన వంటింట్లో లభించే వాటితోనే సులభంగా బరువు తగ్గొచ్చు. అదెలాగో చూద్దాం.

వామునీరు: జీర్ణక్రియను మెరుగుపరచడంలో వాముకు మించింది లేదు. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని వామునీరు తాగితే మెటబాలిజం పెరుగుతుంది. ఇది పొట్ట ఉబ్బరాన్ని తగ్గించడమే కాకుండా కొవ్వు కరగడానికి సాయపడుతుంది.

జీలకర్ర-సోంపు: జీలకర్ర, సోంపు రెండూ శరీరంలోని మలినాలను బయటకు పంపుతాయి. గ్లాసు నీటిలో చెంచా జీలకర్ర, సోంపు వేసి మరిగించి రోజంతా అప్పుడప్పుడు తాగుతుంటే శరీరంలో అదనపు నీరు చేరకుండా ఉంటుంది. తద్వారా బరువు తగ్గుతారు.

నానబెట్టిన మెంతులు: మెంతుల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. రాత్రంతా నానబెట్టిన మెంతులను ఉదయాన్నే తిన్నా లేదంటే ఆ నీటిని తాగినా ఆకలి అదుపులో ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి కొవ్వు కణాలను కరిగిస్తుంది.

త్రిఫలచూర్ణం: ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి ప్రత్యేక స్థానం ఉంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా త్రిఫలచూర్ణం కలిపి తీసుకుంటే పేగులు శుభ్రపడి జీర్ణక్రియ వేగవంతమవుతుంది. బరువు తగ్గడానికి శుభ్రమైన జీర్ణవ్యవస్థ చాలా ముఖ్యం.

వేడినీటిలో తేనె, నిమ్మరసం: ఇది అందరికీ తెలిసిన చిట్కానే. అత్యంత ప్రభావవంతమైనది. రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి తాగితే శరీరంలోని వ్యర్థాలు పోయి కొవ్వు కరగడం వేగవంతమవుతుంది.

అల్లం టీ: గ్రీన్‌టీకి కొద్దిగా అల్లం కలిపితే అది పవర్‌హౌ్‌సలా పనిచేస్తుంది. అల్లం అరుగుదలకు సాయపడటమే కాకుండా రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.

ఇవీ చదవండి

మాకూ హెల్ప్ చేయండి! సుందర్ పిచాయ్‌కు భారతీయ విద్యార్థుల రిక్వెస్ట్

బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ

Updated Date - Jan 29 , 2026 | 03:12 AM