Share News

ఇల్లు దేదీప్యమానంగా...

ABN , Publish Date - Nov 08 , 2026 | 03:13 AM

దీపావళి పండక్కి ఇల్లంతా శోభాయమానంగా మెరిసేలా లైట్లతో, దీపాలతో కొత్తగా ఎలా అలంకరించాలో చూద్దాం...

ఇల్లు దేదీప్యమానంగా...

దీపావళి పండక్కి ఇల్లంతా శోభాయమానంగా మెరిసేలా లైట్లతో, దీపాలతో కొత్తగా ఎలా అలంకరించాలో చూద్దాం...

  • హాల్లో ఓ గోడకు స్టార్‌ లైట్స్‌, ఫెయిరీ లైట్స్‌ను పొడవుగా కర్టెన్‌ మాదిరి లేదంటే ఏదైనా థీమ్‌ ప్రకారం వేలాడదీయాలి. రంగురంగుల లైట్లు ఉండేలా ఎంపిక చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. సాయంత్రం కాగానే వీటిని వెలిగిస్తే ఇల్లంతా దీపావళి శోభ నిండుతుంది.

  • ఇంటి ముందు రంగులతో లేదా పూలతో రంగవల్లికను తీర్చిదిద్ది మధ్యమధ్యలో దీపాల్లా వెలిగే లైట్ల ప్రమిదలను ఏర్పాటు చేస్తే వాకిలి గ్రాండ్‌గా కనిపిస్తుంది. హాల్‌ మధ్యలో అందమైన రంగోలి స్టిక్కర్‌ను అతికించి రాత్రికాగానే దాన్ని దీపాలతో అలంకరిస్తే ఇంటికి పండుగ శోభ వచ్చేస్తుంది.

  • గుమ్మానికి ఇరువైపులా రకరకాల లైట్ల దండలను వేలాడదీస్తే ఇల్లంతా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

  • ఇంట్లో డ్రెస్సింగ్‌ మిర్రర్‌, టీవీ, కంప్యూటర్‌ ముందు అందమైన దీపాలను పెట్టి వాటిని పూలతో అలంకరించవచ్చు.

  • హాల్లో ఓ మూల చిన్న స్టూల్‌ వేసి దానిమీద అందమైన ఆకృతిలో పూలు పరచాలి. వాటి చుట్టూ చిన్న మట్టి ప్రమిదలు ఏర్పాటుచేసి వెలిగిస్తే చాలు ఇంటికి పండుగ కళ వచ్చేస్తుంది. ఈ అలంకరణను సోఫా ముందు టీపాయ్‌ మీద చేసినా బాగుంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. భారీ ఒప్పందం రాబోతోందన్న ట్రంప్..

ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య భర్త అరెస్ట్.. నిందితుడిపై 44 కేసులు..

Updated Date - Nov 08 , 2026 | 03:13 AM